ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్‌ఎల్‌ఐ) తమ యులిప్ ప్లాన్స్ కింద డివిడెండ్ ఈల్డ్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. అత్యధికంగా డివిడెండ్ చెల్లించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందించడం ఈ ఫండ్ లక్ష్యం. ఈ ఫండ్ ప్రధానంగా డివిడెండ్ ఇచ్చే కంపెనీల ఈక్విటీలు, ఈక్విటీల ఆధారిత సాధ నాల్లో 80–100% వరకు, డెట్.. మనీ మార్కెట్ సాధనాల్లో 20% వరకు ఇన్వెస్ట్ చేస్తుంది.
మహీంద్రా మాన్యులైఫ్ ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్‌వోఎఫ్
మహీంద్రా మాన్యులైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ప్రవేశపెట్టింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 1తో ముగుస్తుంది. డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మెరుగైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. 24 నెలలకు పైబడి పెట్టుబడి కొనసాగించి, పన్నుల అనంతరం స్థిరమైన, మెరుగైన రాబడి అందుకోవాలనుకునే వారికి ఇది అనువైనదిగా ఉంటుంది. దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించడం ద్వారా 12.5 శాతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మాత్రమే వర్తించేలా ఎఫ్‌వోఎఫ్ స్వరూపం ఉంటుంది.
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మల్టీ అసెట్ ఎఫ్‌వోఎఫ్
యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ మల్టీ–అసెట్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం ప్రధానంగా.. ఈక్విటీ ఆధారిత, డెట్ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ పథకాలు, కమోడిటీ ఆధారిత ఈటీఎఫ్‌ల యూనిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇది నేరుగా ఆయా సెక్యూరిటీల్లో కాకుండా వాటికి సంబంధించిన ఫండ్ పథకాల్లో పెట్టుబడులు పెడుతుందని గమనించాలి. ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) 2025 నవంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 5న ముగుస్తుంది.


