ఆన్‌లైన్‌లో కొన్న బంగారంపై లోన్‌ ఇస్తారా? | Gold Bought Online Here is How to Get a Quick Loan | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో కొన్న బంగారంపై లోన్‌ ఇస్తారా?

Jan 5 2026 2:46 PM | Updated on Jan 5 2026 3:00 PM

Gold Bought Online Here is How to Get a Quick Loan

దైనందిన ఆర్థిక జీవనంలో మనకు అనేక అనుమానాలు, సందేహాలు ఉంటాయి. నేపథ్యంలో రియల్టీ, బ్యాంకింగ్‌, బంగారం, స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌.. ఇలా భిన్న అంశాలపై పాఠకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల ద్వారా సమాధానాలు అందిస్తోందిసాక్షి బిజినెస్‌’..

రియల్టీ..

ఆదాయంతో పోల్చితే గృహ రుణంపై చెల్లించే ఈఎంఐ ఎంతవరకూ ఉండాలి?

సాధారణంగా అయితే గృహరుణంపై చెల్లించే ఈఎంఐగా మీ ఆదాయంలో 30 శాతాన్ని మించకపోతే మంచిది. 3540 శాతమైతే కాస్త రిస్కే. ఎందుకంటే నెలవారీ క్యాష్‌ ఫ్లో తక్కువగా ఉంటుంది. ఇక 40 శాతం దాటితే వద్దనే చెప్పాలి. ఇంటి ఖర్చులకు డబ్బులు మిగలటం చాలా కష్టమవుతుంది. మెడికల్, ఉద్యోగ ఎమర్జెన్సీలు తలెత్తితే మేనేజ్‌ చేయటం కష్టం. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఇరుక్కుపోయే ప్రమాదముంటుంది. ఒకవేళ ఎక్కువ మంది సంపాదిస్తుంటే, 612 నెలల ఎమర్జెన్సీ నిధి చేతిలో ఉన్నపుడు, ఇతరత్రా రుణాలేవీ లేనప్పుడు మాత్రం 40 శాతానికి అటూ ఇటుగా ఉన్నా మేనేజ్‌ చేయొచ్చు.

బ్యాంకింగ్‌..

నా భార్యతో జాయింట్‌గా ఎఫ్‌డీలను ఓపెన్‌ చేయొ చ్చా? పన్ను ప్రయోజనాలు?

ఇద్దరూ కలిసి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఓపెన్‌ చేయటానికి ఇబ్బందులుండవు. పన్ను ప్రయోజనాలు ఫస్ట్‌ హోల్డర్‌కే వర్తిస్తాయి. ఎఫ్‌డీ తెరిచేటపుడు దాన్ని విత్‌డ్రా చేయటం, రెన్యూవల్‌ చేయటం వంటి హక్కులు ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉండేలా స్పష్టంగా పేర్కొనాలి. అలాకాని పక్షంలో ఫస్ట్‌ హోల్డర్‌కే ఆ హక్కులుంటాయి. తన మరణం తరువాతే మిగిలిన వ్యక్తికి వస్తాయి. ఇద్దరు కలిసి ఎఫ్‌డీ తెరిటేపుడు ఒకరు సీనియర్‌ సిటిజన్‌ అయితే వారినే ఫస్ట్‌ హోల్డర్‌గా పేర్కొంటే వడ్డీ కాస్త ఎక్కువ వస్తుంది. లేని పక్షంలో ఇద్దరిలో ఎవరు తక్కువ ట్యాక్స్‌ బ్రాకెట్లో ఉంటారో వారి పేరిట తెరిస్తే... వడ్డీపై పన్ను తక్కువ చెల్లించాల్సి వస్తుంది.

బంగారం

బంగారం ఆన్‌లైన్లో కొన్నాను. దీన్ని తనఖా పెట్టవచ్చా?

ఆన్‌లైన్లో కాయిన్లు, ఆభరణాల రూపంలో కొంటే దాన్ని తనఖా పెట్టవచ్చు. స్వచ్ఛతకు సంబంధించిన కొన్ని నిబంధనలున్నాయి. వాటికి లోబడి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు తనఖా పెట్టుకుంటాయి. ఒరిజినల్‌ బిల్లు తప్పనిసరిగా ఉండాలి. బంగారం 22 లేదా 24 క్యారెట్ల స్వచ్ఛతను కలిగి ఉండాలి. హాల్‌మార్క్‌ ఉంటే ఈజీగా అంగీకరిస్తారు. కొన్ని బ్యాంకులైతే ప్రయివేటు మింట్‌ల నుంచి వచి్చన కాయిన్లను 50 గ్రాములకన్నా ఎక్కువ తీసుకోవటం లేదు. అలాంటి పక్షంలో ముత్తూట్, మణప్పురం వంటి ఎన్‌బీఎఫ్‌సీలు బెటర్‌. మీకు బంగారంపై రుణం సత్వరం కావాలంటే ఎన్‌బీఎఫ్‌సీలే నయం. బ్యాంకులు నిబంధనల విషయంలో కఠినంగా ఉంటాయి.

స్టాక్‌ మార్కెట్‌...

ట్రేడింగ్‌ ఖాతా ఓపెన్‌ చేయడానికి నిబంధనలేంటి? సిబిల్‌ స్కోరు అవసరమా?

ట్రేడింగ్‌ ఖాతా తెరవటానికి సిబిల్‌ స్కోరు అవసరం లేదు. కాకపోతే 18 ఏళ్లు నిండి ఉండాలి. పాన్‌ కార్డు, ఆధార్‌ నంబరు, బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబరు, ఈమెయిల్‌ ఉండాలి. షేర్లలో ఇన్వెస్ట్‌ చేయటం వరకూ పర్వాలేదు గానీ... ఎఫ్‌అండ్‌ఓ, కమోడిటీకరెన్సీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్‌ చేయాలంటే మాత్రం ఆదాయపు ధ్రువీకరణ పత్రం అవసరం. దీనికోసం ఐటీఆర్, 3 నెలల శాలరీ స్లిప్స్, బ్యాంక్‌ స్టేట్‌మెంట్, నెట్‌వర్త్‌ సర్టిఫికెట్‌ వంటివాటిలో ఏదైనా సరిపోతుంది. షేర్లను హోల్డ్‌ చేయడానికి డీమ్యాట్‌ ఖాతా తప్పనిసరి. మనకైతే మామూలు కేవైసీ సరిపోతుంది. ఎన్‌ఆర్‌ఐలకు ప్రత్యేక ఎన్‌ఆర్‌ఈ ఖాతా అవసరం.

మ్యూచువల్‌ ఫండ్స్‌...

సిప్‌లలో ఎంతశాతం రాబడిని ఆశించవచ్చు?

సిప్‌లలో రాబడులనేవి అది ఏ తరహా ఫండ్‌.. ఎంతకాలం ఇన్వెస్ట్‌ చేశారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. పదేళ్లకు మించి చూస్తే... లార్జ్‌క్యాప్‌ ఫండ్లు 10012 శాతం, మిడ్‌ క్యాప్‌ ఈక్విటీ 1215 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఈక్విటీ 1418 శాతం, హైబ్రిడ్‌ ఫండ్లు 810 శాతం, డెట్‌ ఫండ్లు 57 శాతం రాబడులను అందించిన పరిస్థితి ఉంది. సిప్‌లు కనీసం ఏడేళ్లకు పైబడి చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి. స్వల్పకాలా నికైతే ఒకోసారి నెగెటివ్‌ రాబడులూ ఉండొచ్చు. మార్కెట్లలో ఎగుడుదిగుళ్లు సహజం. వాస్తవ రాబడులనేవి మార్కెట్‌ సైకిల్స్, మీరు ఎంచుకున్న ఫండ్‌ నాణ్యత, మీ క్రమశిక్షణపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా.. దీర్ఘకాలమైతేనే ‘సిప్‌’ చెయ్యండి.

ఇన్సూరెన్స్‌

హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు టాప్‌అప్‌ చేయించడం మంచిదేనా?

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ తక్కువగా ఉందని భావిస్తే టాప్‌అప్‌ మంచిదే. మీ అవసరాలు, బడ్జెట్‌ కూడా చూసుకోవాలి. టాప్‌అప్‌ మీ ఇన్సూరెన్స్‌ మొత్తం సరిపోని పక్షంలో మాత్రమే అక్కరకొస్తుంది. అంటే మీకు రూ.5 లక్షల బీమా ఉందనుకుందాం. రూ.10 లక్షలకు టాప్‌అప్‌ తీసుకుంటే... మీకు అవసరం వచి్చనపుడు రూ.5 లక్షలు పూర్తయిపోయాక ఈ టాప్‌ అప్‌ మొత్తం అక్కరకొస్తుంది. అందుకని మీకు ప్రస్తుత ఇన్సూరెన్స్‌ సరిపోదని భావిస్తున్నపుడే టాప్‌అప్‌ వైపు చూడాలి. మీరు యువకులై ఉండి, మీకు కవరేజీ గనక రూ.10 లక్షల వరకూ ఉందనుకుందాం. అపుడు టాప్‌అప్‌ అవసరం చాలా తక్కువపడుతుంది.

మీ సందేహాలకూ నిపుణుల ద్వారా సమాధానాలు కావాలంటే business@sakshi.com కు మెయిల్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement