అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి | Rich Dad Poor Dad Robert Kiyosaki says Bitcoin becomes better than gold | Sakshi
Sakshi News home page

అది బంగారాన్ని మించిపోతుంది..: కియోసాకి

Feb 21 2026 1:55 PM | Updated on Feb 21 2026 2:21 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki says Bitcoin becomes better than gold

బిట్ కాయిన్ ధర కీలక మద్దతు స్థాయికి చేరువ కావడంతో మార్కెట్లో ఆందోళన పెరిగింది. బిట్ కాయిన్ ధర ఇటీవల 60,000 డాలర్ల వద్ద ఉన్న దిగువ అంచును తాకింది. ఈ పరిణామంతో పలువురు పెట్టుబడిదారులు మరింత పతనం సంభవిస్తుందని అంచనా వేస్తున్న వేళ, ప్రముఖ ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) మాత్రం విభిన్న నిర్ణయం తీసుకున్నారు.

ధరలు పడిపోతున్న సమయంలోనే సుమారు 67,000 డాలర్ల వద్ద మరో పూర్తి బిట్ కాయిన్‌ను కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. అమెరికా ప్రభుత్వ రుణభారం పెరుగుతున్న నేపథ్యంలో డాలర్‌పై ఒత్తిడి అధికమవుతుందని, దాని ఫలితంగా భారీ స్థాయిలో డబ్బు ముద్రణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే ఆయన “బిగ్ ప్రింట్”గా పేర్కొన్నారు.

ఇక బిట్ కాయిన్ ప్రత్యేకత దాని పరిమిత సరఫరా అని కియోసాకి గుర్తుచేశారు. గరిష్టంగా 21 మిలియన్ నాణేలు మాత్రమే ఉండేలా రూపొందించిన ఈ డిజిటల్ ఆస్తి సరఫరాను ఏ కేంద్ర అధికారం పెంచలేనని తెలిపారు. ప్రతి కొత్త బిట్ కాయిన్ ముందే నిర్ణయించిన వేగంతోనే మార్కెట్లోకి ప్రవేశిస్తుందని, తుది నాణేల మైనింగ్‌కు దగ్గరపడే కొద్దీ దాని కొరత మరింత స్పష్టమవుతుందని పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా కరెన్సీ బలహీనతకు వ్యతిరేకంగా బంగారాన్ని సురక్షిత ఆశ్రయంగా భావిస్తున్నన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో బిట్ కాయిన్ బంగారాన్ని మించిపోవచ్చని కియోసాకి వాదిస్తున్నారు. పెరుగుతున్న ప్రభుత్వ రుణాలు, కేంద్ర బ్యాంకుల విధానాల నేపథ్యంలో కొరత గల ఆస్తుల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement