సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా.. | Latest Gold and Silver Price in India | Sakshi
Sakshi News home page

సాయంత్రానికి పెరిగిన రేటు.. బంగారం ధరలు ఇలా..

Feb 20 2026 9:11 PM | Updated on Feb 20 2026 9:25 PM

Latest Gold and Silver Price in India

శుక్రవారం ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. సాయంత్రానికి మారిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు మారిపోయాయి. ఈ కథనంలో ప్రస్తుత పసిడి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,43,150 వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ. 1,44,250 వద్ద నిలిచింది. 1,56,170 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,57,370 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి.

ఢిల్లీలో 1,43,330 వద్ద ఉన్న తులం 22 క్యారెట్ల ధర 1,44,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,56,320 రూపాయల వద్ద నుంచి రూ. 1,57,520 వద్దకు చేరింది. అయితే చెన్నైలో.. బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల రేటు రూ.1,44,200 వద్ద, 24 క్యారెట్ల రేటు 157310 రూపాయల వద్ద ఉంది.

వెండి ధరలు
వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2.70 లక్షల వద్ద ఉంది. నిన్న (గురువారం) రూ.10 వేలు పెరిగిన రేటు.. ఈ రోజు (శుక్రవారం) స్థిరంగా ఉంది.

ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement