బంగారం ధర రూ.లక్ష కంటే తక్కువకు..? | Gold Rate in India May Crash Below Rs 1 Lakh | Sakshi
Sakshi News home page

బంగారం ధర రూ.లక్ష కంటే తక్కువకు..?

Feb 16 2026 3:09 PM | Updated on Feb 16 2026 4:00 PM

Gold Rate in India May Crash Below Rs 1 Lakh

బంగారం కొనాలంటేనే భయపడుతున్న సమయంలో.. నిపుణులు పసిడి ప్రియులకు శుభవార్త చెప్పారు. తులం గోల్డ్ రేటు లక్ష రూపాయల కంటే తక్కువకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్సు ధర 3000 డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు. రష్యా అమెరికాతో వ్యాపారం చేయడం ప్రారంభిస్తే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

2025లో భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. 2026 జనవరిలో కూడా అదే రీతిగా ముందుకు సాగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల ధర రూ.1.80 లక్షల స్థాయికి చేరింది. కాగా గత వారంలో ఎంసీఎక్స్ బంగారం ధర రూ. 1.56 లక్షల (10 గ్రామ్స్) వద్ద నిలిచింది. దీన్నిబట్టి చూస్తే.. ఇప్పుడు పరిస్థితులు కొంత చక్కబడ్డాయని, బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయని తెలుస్తోంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా అమెరికాతో డాలర్లలో (USD) వ్యాపారం చేయడానికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. రష్యన్ అంతర్జాతీయ డాక్యుమెంట్ క్రెమ్లిన్.. అమెరికాతో ఆర్థిక భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోందని సూచిస్తోంది. ఈ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన భాగం మాస్కో యుఎస్ డాలర్ ఆధారిత వాణిజ్య ఒప్పందానికి తిరిగి రావడం. ఇది రష్యాతో సహా బ్రిక్స్ దేశాల డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అవుతుంది.

ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

రష్యా అంతర్జాతీయ వాణిజ్యాన్ని డాలర్లతో నిర్వహిస్తే.. డాలర్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం కొంత తగ్గిస్తాయి. ఇవన్నీ బంగారం రేటును గణనీయంగా తగ్గించడంలో  దోహదపడతాయి.

భారతదేశంలో నేటి బంగారం ధరలు
ఇండియన్ మార్కెట్లో ఈ రోజు (ఫిబ్రవరి 16) బంగారం ధరలు రూ. 1000 కంటే ఎక్కువ తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.56 లక్షల వద్ద, 22 క్యారెట్స్ తులం బంగారం ధర రూ. 1.43 లక్షల వద్ద ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement