ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా? | Globally Gold and Silver Are Slowly Coming Out of The High Volatility Phase | Sakshi
Sakshi News home page

ఆర్థిక భవిష్యత్తు: బంగారం కొనాలా.. వద్దా?

Feb 15 2026 5:08 PM | Updated on Feb 15 2026 5:31 PM

Globally Gold and Silver Are Slowly Coming Out of The High Volatility Phase

కొన్ని రోజులకు ముందు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. రేట్లు పెరుగుతున్నప్పుడు.. ఏ ధరకైనా కొనేయాలని ఎగబడిన కొంతమంది జనం.. ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అని వేచి చూస్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం ఉందేమో అని ఆలోచిస్తున్నారని ప్రముఖ ఇన్వెస్టర్, మార్కెట్ మాస్ట్రోలో డైరెక్టర్ 'అంకిత్ యాదవ్' తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.

ధరలు పెరిగినప్పుడు ఉత్సాహం చూపించారని, రేటు తగ్గుతున్నప్పుడు ప్రజలు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఇది మార్కెట్‌లో సహజమైన అంశం. అయితే ఇది పూర్తి స్థాయి క్రాష్ అని నిర్దారించలేము. ఇదొక స్లోడౌన్ దశ మాత్రమే.

వెండి ధర భవిష్యత్తులో 100 డాలర్లు లేదా 120 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. దీనికి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ప్రధాన కారణమవుతాయి.

ప్రపంచం మొత్తం.. ప్రస్తుతం భారీ రుణభారంతో ఉంది. ముఖ్యంగా అమెరికా అప్పులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్‌కు (Fed) అందుబాటులో ఉన్న ఎంపికలు చాలా తక్కువ. ఇలాంటి సమయంలో వారు ఎక్కువ లిక్విడిటీ అందించడం, అంటే మరింత డబ్బు ముద్రించడానికి సిద్దపడే అవకాశం ఉంది. ఇదే జరిగితే డాలర్ విలువ బలహీనపడే అవకాశం ఉంటుంది.

డాలర్ విలువ ఎప్పుడైతే పడిపోతుందో.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇప్పటికే బంగారం లేదా వెండి కలిగి ఉన్నవాళ్లు దాన్ని నిల్వ చేసుకోండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కొత్తగా గోల్డ్, సిల్వర్ కొనాలనుకుంటే.. తప్పకుండా ఓసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ధరలు చౌకగా లేవు. ఎప్పుడైనా ఎక్కువ ధర వద్ద పెట్టుబడి పెట్టడం వల్ల మూలధన నష్టం వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి త్వరగా ధనవంతులు కావాలని తొందరపడకూడదు. కొంత ఓపిగ్గా ఎదురు చూడండి అని.. అంకిత్ యాదవ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement