బిహార్‌లో జరిగిన ఘటన ఒకటి తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. ఒక ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తున్న మహిళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు. దీంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్‌లోని భోజ్‌పూర్‌లో చంద్వా తోలా ప్రాంతంలో జరిగిన స్థానిక సాంస్కృతిక కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. వేలాదిమంది గుమిగూడిన జనం మధ్యం వేదికపై న్యృత్య ప్రదర్శన జరుగుతోంది. ఇంతలో డ్యాన్స్ చేస్తున్న నృత్యకారిణిపట్ల కొంతమంది ఆకతాయిలు నీచంగా ప్రవర్తించారు. ఆమె డ్యాన్స్ చేస్తుండగా కొంతమంది నాణేలు విసిరారు. మరికొంతమంది అంతటితో ఆగలేదు. నాణేలను బలవంతంగా నోటిలోకి దూర్చి, మింగించారు. దీంతో ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోవడంతో వాతావరణం గందరగోళంగా మారింది. దీంతో పరిస్థితి అదుపు పోలీసులు జోక్యం చేసుకుని, అత్యవసర చికిత్స కోసం ఆమెను అరా సదర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె గొంతు నుండి నాణేలను తొలగించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడవాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు
తన భార్య వేదికపై నృత్యం చేస్తుండగా, కొంతమంది ప్రేక్షకులు పైకి ఎక్కి బలవంతంగా ఆమె నోటిలో నాణేలు పెట్టడంతో మింగేసిందనీ, వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లామని బాధితురాలి భర్త రాజు కుమార్ వాపోయారు. ఈ సంఘటనపై పోలీసులు, ఇతర జిల్లా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షులు , ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.
ఇదీ చదవండి: బెంగళూరులో తొలి స్టోర్ : ఆటోలో స్టైలిష్‌గా ‘నథింగ్’ సీఈవో


