పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే! | Hyderabad PC Sajjanar shares a digital arrest awareness video goes viral | Sakshi
Sakshi News home page

పోలీస్ వేషం, వీడియో కాల్ : నమ్మితే మునిగినట్టే!

Feb 14 2026 2:21 PM | Updated on Feb 14 2026 3:19 PM

Hyderabad PC Sajjanar shares a digital arrest awareness video goes viral

బెట్టింగ్‌ యాప్‌లు, సైబర్‌ మోసాలు,  స్కాంలపై  అలుపెరుగని పోరు సల్పుతూ, నిరంతరం ప్రజల్లో అవగాహ కల్పించే, పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మరో ఇంట్రస్టింగ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇటీవలి కాలంలో  విద్యావంతులు కూడా డిజిటల్‌ అరెస్ట్‌ స్కాం బారిన పడి  కోట్ల రూపాయలు  పోగొట్టుకుంటున్న  కేసులను అనేకం   చూస్తున్నాం. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలపై అవగాహన కల్పిస్తూ వచ్చిన ఒకవీడియోను  ఎక్స్‌లో షేర్‌ చేశారు. దీంతో పాటు తన సందశాన్ని కూడా జోడించారు.

‘‘పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు!

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరించారు. నకిలీ పోలీసులుగా మారి, వీడియో కాల్స్ ద్వారా ప్రజలను ఎలా భయపెడుతున్నారో పూసగుచ్చినట్లు చెప్పారు.

దయచేసి గమనించండి... పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ జరపరు, డబ్బులు అడగరు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే చట్టంలో లేదు. ఇలాంటి కాల్స్ వస్తే ఆందోళన చెందకండి.

హైదరాబాద్ పోలీసులు చేపట్టిన 'జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోను షేర్ చేసి, మీ వారికి కూడా అవగాహన కల్పించండి’’ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement