ప్రజల రుణం తీర్చుకుంటా | Gaddam Ananya Wins Vikarabad Ward 17 | Sakshi
Sakshi News home page

ప్రజల రుణం తీర్చుకుంటా

Feb 14 2026 11:00 AM | Updated on Feb 14 2026 11:14 AM

Gaddam Ananya Wins Vikarabad Ward 17

వికారాబాద్‌ పురపాలిక కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి అనన్య

అనంతగిరి: ‘మున్సిపల్‌ ఎన్నికల్లో వికారాబాద్‌ పట్టణ ప్రజలు తనను ఎంతగానో ఆదరించారు.. భారీ మెజారిటీతో గెలిపించారు.. వారి రుణం తీర్చుకునే సమయం వచి్చంది.. పట్టణంలోని ప్రతి వార్డులో పర్యటించా.. ప్రజల సమస్యలన్నీ తెలుసు.. వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యం.. నాన్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సహకారం.. ప్రభుత్వ అండదండలతో పట్టణ రూపురేఖలు మారుస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం’ అని 17వ వార్డు కౌన్సిలర్‌.. కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి అనన్య అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.   

 మీ విజయానికి దోహదం చేసిన అంశాలు?  
కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే నా విజయానికి దోహదం చేశాయి. 17వ వార్డు ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారు. నాన్న ఆశీర్వాదం ఫలించింది. అందరి ఆదరణతోనే విజయం సాధించా. 

ఏయే సమస్యలు గుర్తించారు?  
వార్డుల్లో పర్యటించినప్పుడు పలు చోట్ల డ్రైనేజీ సమస్య, మంచినీటి సమస్య ఉన్నట్లు గుర్తించాం. తొలుత వీటి పరిష్కారానికి కృషి చేస్తాం.  

అభివృద్ధిపై మీ ప్రణాళిక ఏంటీ?  
వికారాబాద్‌ పట్టణంపై పూర్తి అవగాహన ఉంది. నాన్న రాజకీయాల్లో ఉండటంతో చాలా నేర్చుకున్నా.. మున్సిపల్, ప్రభుత్వ నిధులతో వికారాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం.      

Advertisement
 
Advertisement
Advertisement