విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 (FIFA World Cup 2026) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు గురువారం తెరలేచింది.
మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి.
దాదాపు 90 వేల మంది సామర్థ్యం గల అజ్టెకా స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా ఈ వేడుకలు సాగాయి.
ఇందులో ప్రముఖ పాప్ సింగ్ షకీరా, డానీ ఓసియన్, బాల్విన్, బెలిండాతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్‌లు ఆడిపాడారు.


