విద్యార్థినితో ప్రొఫెసర్‌ ప్రేమాయణం | student love with professor in karnataka | Sakshi
Sakshi News home page

విద్యార్థినితో ప్రొఫెసర్‌ ప్రేమాయణం

Jun 7 2026 10:51 AM | Updated on Jul 3 2026 7:51 PM

student love with professor in karnataka

హుబ్లీ: విద్యాను బోధించే గురువు స్థానం అత్యున్నతమైనదని భారత సంప్రదాయాలు చాటి చెబుతున్నాయి. అయితే విద్యా బోధన చేసే గురువే విద్యార్థినితో ప్రేమాయణం సాగించిన ఘటన కర్ణాటక విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇక్కడి శాస్యశాస్త్రం విభాగం ఫ్రొఫెసర్‌ దేవరాజ సంగుదొరై విజయపురకు చెందిన అదే వి«భాగంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినితో ప్రేమ వ్యవహారం జరిపారు. ఇద్దరూ చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. 

వీరిద్దరి ప్రేమ గొడవ తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆమె పీహెచ్‌డీని సంగంలోనే ఆపేసి ఇంటికి తిరిగి తీసుకెళ్లి పోయారు. కొన్ని రోజుల తర్వాత విజయపురకు చెందిన విద్యార్థి తన వద్దకు పీహెచ్‌డీ చేయడానికి రాగా గతంలో మధ్యలోనే పీహెచ్‌డీని ఆపేసి వెళ్లిన విద్యార్థినిని తిరిగి కళాశాలకు తీసుకొని వస్తేనే పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తానని ఆంక్షలు పెట్టారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థి ఈ విషయంపై వైస్‌ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement