దూరంగా వెళ్లే ఒక్క పామును చూస్తేనే ఒళ్లు భయంతో జలదరిస్తుంది. అలాంటి ఇళ్ల ముందే అనేక సర్పాలు కనిపిస్తే చెమటలు పట్టాల్సిందే. బెంగళూరు సమీపంలో నెలమంగల పట్టణంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. ఇళ్ల మధ్యలో కుప్పలుగా సర్పాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెల్లిపోతున్నారు. ఇళ్ల లోపల, ముందు, కాంపౌండ్లలో, చెప్పుల స్టాండ్లలో, పొదల్లో ఇలా ఎక్కడ చూసినా సర్పాలే దర్శనమిస్తున్నాయి.
స్నేక్ క్యాచర్ విశ్వనాథ్ ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి బంధించి దూరంగా వదిలేస్తున్నాడు. ఎక్కువగా ప్రమాదకర రక్తపింజర, నాగుపాములు ఉంటున్నాయి. ఓ ఫాం హౌస్‌లోనే 20 పైగా రక్తపింజర పాముల పిల్లలు కనిపించగా వాటిని పట్టి బకెట్లో వేశారు. అలాగే నాగుపాము పిల్లలూ దొరికాయి. దేశంలోనే అత్యధిక విషం కలిగిన నాలుగు రకాల పాములు కూడా నెలమంగలో దొరికాయని విశ్వనాథ్ తెలిపాడు. ప్రజలు చాలా జాగ్రత్తా ఉండాలని ఆయన సూచించారు.
- కర్ణాటక


