breaking news
sanke
-
సంగమేశ్వరుని సన్నిధిలో నాగుపాము కలకలం
పార్వతీపురం మన్యం: వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నాగుపాము కలకలం సృష్టించింది. ఆలయం గర్భగుడిలో ప్రధాన అర్చకుడు సిద్ధాంత గణపతి పూజలు చేస్తున్న సమయంలో నాగుపాము దర్శనమిచ్చింది. వీటిని చూసిన భక్తులు బయటకు పరుగులు తీశారు. శివ సన్నిధిలో నాగుపాము దర్శనమివ్వడం, భక్తులు ఒకింత అదృష్టంగా భావించినప్పటికీ, భారీ నాగుపాము కావడంతో భక్తులు భయాందోళన చెందారు. అర్చకులు నాగుపామును సమీప తోటల్లోకి మళ్లించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నాగావళికి జలకళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండురోజులుగా నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టవద్ద 10,460 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందకు విడిచిపెడుతున్నట్టు ఆనకట్ట ఏఈ శివాజీ తెలిపారు. నదిలోకి ఎవరూ దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. – సంతకవిటి -
ఈ పాము కనపడితే.. వేగంగా పరిగెత్తినా తప్పించుకోలేరు..
వానాకాలంలో పాములు అధికంగా బయటకు వస్తుంటాయి. పాము కాట్ల భయం ఎక్కువగా ఉంటుంది. మీకు పాముల్లో యముడులాంటి ‘‘బ్లాక్ మాంబా’’ గురించి తెలుసా? అవి వేగంగా కదులుతాయి.. అత్యంత ప్రాణాంతక విషాన్ని కలిగి ఉంటాయి.. బాగా దూకుడు స్వభావం చూపుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, లెక్కించలేనన్ని మానవ మరణాలకు కారణమయ్యాయని భావిస్తారు. ఇక్కడ ప్రస్తావిస్తున్నది ‘‘బ్లాక్ మాంబా’’ గురించే.. భూమిపై అత్యంత వేగవంతమైన, అత్యంత ప్రమాదకరమైన పాములు. ఇవి గంటకు 12.5 మైళ్ల వేగంతో పాకుతాయి. వాటి వద్ద ఉన్న ఆయుధం అది ఒక్కటే కాదు. వేటాడే తీరు కూడా అంతే భయంకరం. మెరుపువేగంతో దాడి చేసి ఆహారాన్ని పట్టుకుంటాయి. ఇవన్నీ అద్భుతమైన సామర్థ్యంతో, నిశ్శబ్దంగా జరుగుతాయి.ఎక్కువగా ఎక్కడ ఉంటాయి?బ్లాక్ మాంబాలు దక్షిణ, తూర్పు ఆఫ్రికాలోని గడ్డి మైదానాలు, రాతి కొండల్లో నివసిస్తాయి. ఇవి ఆఫ్రికాలో అత్యంత పొడవైన విషపూరిత పాములు. పొడవు 14 అడుగుల వరకు పెరుగుతుంది. సగటు పొడవు 8.2 అడుగులు. వీటి పొలుసులు ఆలివ్ రంగు నుంచి బూడిదరంగు వరకు ఉంటాయి. ప్రమాదం ఎదురైనప్పుడు నోటి లోపల కనిపించే నీలం-నలుపు రంగు కారణంగా వీటికి ఈ పేరు వచ్చింది.మగ, ఆడ మాంబాల మధ్య బయటకు కనిపించే తేడా ఉండదు. సంతానోత్పత్తి వసంతకాలం, ప్రారంభ వేసవిలో జరుగుతుంది. ఆడ పాములను వెతికేందుకు మగ పాములు చాలా దూరం ప్రయాణిస్తాయి. జతకట్టే హక్కు కోసం ప్రత్యర్థి మగ పాములతో పోరాడుతాయి. ఆడ పాము 10 నుంచి 25 గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాటి వద్దకు తిరిగి రాదు. సుమారు 80 నుంచి 90 రోజుల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. పుట్టినప్పుడు వాటి పొడవు దాదాపు 51 సెం.మీ. ఉంటుంది.పుట్టిన వెంటనే అవి స్వతంత్రంగా జీవిస్తాయి. మగ, ఆడ పాములు రెండూ తమ పిల్లలను కాపాడవు. 12 నెలల్లో పిల్లల పొడవు 2 మీటర్ల వరకు పెరుగుతుంది. అయితే ముంగీస వంటి మాంసాహార జంతువుల దాడుల నుంచి తప్పించుకోవాలి.బ్లాక్ మాంబాలపై అపోహలుప్రాణాంతక స్వభావం కారణంగా బ్లాక్ మాంబాలు ఆఫ్రికా సంస్కృతిలో ఎన్నో అపోహలతో ముడిపడ్డాయి. ఈ జాతిపై ఆధారంలేని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు భారీ బ్లాక్ మాంబా “గాలిలా కదులుతూ” దక్షిణ ఆఫ్రికాలోని మేరిప్స్కాప్ పర్వతంపై సంచరిస్తుందని నమ్ముతారు. మరికొందరు సుడిగాలి రావడానికి ఈ పామే కారణమని చెబుతారు. తోక చివరపై నిలబడి సమతుల్యం సాధిస్తుందని కూడా ప్రచారం ఉంది. ఇంకో కథనం ప్రకారం బ్లాక్ మాంబా తన శరీరాన్ని చుట్టుకొని తిరుగుతూ దాడి చేస్తుందని చెబుతారు.బ్లాక్ మాంబాలు ఎంత ప్రమాదకరమంటే?భూమిపై అత్యంత ప్రాణాంతక జీవుల్లో ఒకటిగా భావించే ఈ పాములు సాధారణంగా భయపడే స్వభావం కలిగి ఉంటాయి. ఎదురైన ప్రమాదం నుంచి తప్పించుకోవడానికే ఎక్కువగా ప్రయత్నిస్తాయి. ఇవి సామాజిక జీవులు కావు. తమ పరిధిని కాపాడే స్వభావం కూడా ఉండదు. ఒక ప్రాంతంలో నివసించినా దాన్ని రక్షించేందుకు ముందుకు రావు.అయితే మూలకు నెట్టినప్పుడు వీటి రూపం మారిపోతుంది. తలను పైకెత్తుతాయి. కొన్నిసార్లు శరీరంలో మూడో వంతు భాగాన్ని నేలపై నుంచి లేపుతాయి. నాగుపాము మాదిరి మెడ భాగాన్ని విస్తరింపజేస్తాయి. నల్లటి నోరు తెరిచి బుసలు కొడతాయి. దాడి చేసే వ్యక్తి వెనక్కి తగ్గకపోతే ఒక్కసారి కాదు, పలుమార్లు కాటేస్తాయి. ప్రతి కాటుతో శక్తిమంతమైన న్యూరోటాక్సిన్, కార్డియోటాక్సిన్ విషాన్ని అధికంగా విడుదల చేస్తాయి.వేట సమయంలో బ్లాక్ మాంబాలు వేగంగా నేలపై పాకుతాయి లేదా తక్కువ ఎత్తులో ఉన్న చెట్ల కొమ్మలపై కదులుతాయి. దాడి చేసే సమయంలో తలను నేలపై నుంచి 1 మీటరు ఎత్తు వరకు ఎత్తగలవు. కదులుతున్నప్పటికీ 50 సెం.మీ. ఎత్తులో తలను ఉంచగలవు.అత్యంత పదునైన చూపు కారణంగా ఎలుకలు, గబ్బిలాలు, పక్షులు, బల్లులు వంటి ఆహారాన్ని వెంటనే గుర్తిస్తాయి. మెరుపువేగంతో దాడి చేసి కాటేస్తాయి. ఆ తర్వాత వాటి శక్తిమంతమైన విషమే వేటను చంపేస్తుంది. విషం నోటిముందు భాగంలో ఉన్న రెండు ఖాళీ కోరల ద్వారా శరీరంలోకి చేరుతుంది. పాము కాటు వేయకముందు అవి నోటిలో ముడుచుకుని ఉంటాయి. కాటు వేస్తున్నప్పుడు నోటిలోని చిన్న ఎముకల సహాయంతో అవి నిటారుగా నిలుస్తాయి. ఈ విషం వేగంగా పక్షవాతం కలిగిస్తుంది. లాలాజలంలో ఉన్న ఎంజైములు ఆహారాన్ని మృదువుగా మార్చడం ప్రారంభిస్తాయి. తర్వాత దాన్ని పూర్తిగా మింగేస్తుంది.20 నిమిషాల్లోనే ప్రాణాలు పోయేవి..ఈ భయంకరమైన పాము కాటు వేసినప్పుడు ప్రతివిషం అందుబాటులోకి రాకముందు దాదాపు ప్రతి సందర్భంలో మరణమే సంభవించేది. సాధారణంగా 20 నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయేవారు. దురదృష్టవశాత్తూ బ్లాక్ మాంబాలు నివసించే ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ విరుగుడు ఔషధాలు విస్తృతంగా అందుబాటులో లేదు. అందువల్ల మాంబా కాట్ల వల్ల మరణాలు ఇప్పటికీ తరచూ జరుగుతున్నాయి.బ్లాక్ మాంబా విషం అత్యంత శక్తిమంతమైనది. కేవలం 2 చుక్కల విషమే ఒక మనిషిని చంపేందుకు సరిపోతుంది. ఒక మాంబా కోరల్లో 20 చుక్కల వరకు విషం ఉండొచ్చు. సగటున ఒక కాటుతో 100 నుంచి 120 మిల్లీగ్రాముల విషం శరీరంలోకి చేరుతుంది. 400 మిల్లీగ్రాముల వరకు నమోదైంది. మనిషిని చంపేందుకు 10 నుంచి 15 మిల్లీగ్రాములు సరిపోతాయి. ఈ విషంలో న్యూరోటాక్సిన్లు, కార్డియోటాక్సిన్లు ఉంటాయి. మొదటివి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. రెండోవి గుండెపై దాడి చేస్తాయి.కాటు వేసిన ప్రదేశంలో స్వల్ప వాపు, నొప్పి లేదా మంట వంటి లక్షణాలు మొదట కనిపిస్తాయి. నాలుక, దవడపై నియంత్రణ కోల్పోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం, సొరంగం మాదిరిగా కనిపించడం, మసక చూపు, మగత, అన్ని కండరాల్లో పక్షవాతం, మానసిక గందరగోళం ఏర్పడతాయి. బ్లాక్ మాంబా కాటు తర్వాత 45 నిమిషాల్లోనే మనిషి కుప్పకూలే అవకాశం ఉంది. చికిత్స లేకపోతే 7 నుంచి 15 గంటల్లో మరణం సంభవిస్తుంది. ఎంత త్వరగా చికిత్స అందితే అంత ఎక్కువగా ప్రాణాపాయం తగ్గుతుంది.చికిత్స లేకపోతే ఈ పాము కాటు వల్ల మరణించే అవకాశం 100 శాతం. ఆఫ్రికా ఖండంలో ప్రతి ఏడాది దాదాపు 20,000 మంది పాముకాట్ల వల్ల మరణిస్తున్నారని భావిస్తారు. దక్షిణ ఆఫ్రికాలోని స్వాజిలాండ్ ప్రాంత ప్రజలు తరతరాలుగా ఈ నష్టాలను ఎదుర్కొంటున్నారు.ఈ ప్రాంతంలో కనిపించే 4 మాంబా జాతుల్లో బ్లాక్ మాంబా ఒకటి. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత ప్రమాదకరమైన పాముల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తుంది. మీరు వేగంగా పరుగెత్తగలనని అనుకున్నా, బ్లాక్ మాంబా ఇంకా వేగంగా కదులుతుందని గుర్తుంచుకోవడం మంచిది. -
షాకింగ్ వీడియో.. పడుకున్న రైతు షర్టులో దూరిన పాము
-
కట్లపాము కాటు.. క్షణాల్లో ప్రాణాపాయం!
శ్రీకాకుళం జిల్లా: జిల్లాలో పాముకాటు మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోనే పాముకాట్లు అధికంగా ఉంటున్నాయి. ఏటా రెండు వేల మందికిపైగా పాముకాటుకు గురవుతున్నారు. అందులో 400 మంది వరకూ మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది రైతులే కావడం బాధాకరం. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములు ప్రాణాలు బలిగొంటున్నాయి. జిల్లాలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు విపరీతమైన ఉష్ణోగ్రతలు కూ డా ఉన్నాయి. వేడి వాతావరణాన్ని తట్టుకోలేక విష జంతువులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్తున్న వారిని కాటు వేస్తున్నాయి. అందుకే రైతులు, శ్రమజీవులు పొలాలకు వెళ్లినప్పడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.పాముకాటు వేసిన వెంట నే సకాలంలో వైద్యం అందక చాలా మంది ప్రాణా లు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటువైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవెలెంట్ యాంటీ వినమ్’ శాసీ్త్రయంగా నిరూపితమైన మందు. దాదాపు అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచిన ట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో చాలా ఆస్పత్రుల్లో అందుబాటులో లేవన్న విమర్శలున్నాయి. సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో మాత్రం అందుబాటులో ఉంటుంది. కానీ మొదటి 5–10 డోసుల వరకూ ఉంటుంది. అటు తర్వాత జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి వెళితే ఉపశమనం దక్కుతుంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడు గంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వీనమ్ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లాలో 60 పీహెచ్‌సీలతోపాటు 108, 104 వాహనాల్లో యాంటీ వినమ్ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచితే పాముకాటు మృతులను తగ్గించవచ్చు. కొన్ని ఘటన●ఈ నెల 10న ఎల్‌ఎన్‌పేట మండలం జాడుపేట గ్రామానికి చెందిన కరణం సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు.●గత ఏడాది నవంబరు 10న జలుమూరు మండలం యాతపేట గ్రామానికి చెందిన వాడ సింహాచలం పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.●గత ఏడాది సెప్టెంబరు 11న ఎల్‌ఎన్‌పేట మండలం బసవరాజుపేటకు చెందిన వాన అప్పలనాయుడు పాముకాటుతో మృతిచెందాడు. పొలం పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.●గత ఏడాది జూలైలో ఒక్క ఎల్‌ఎన్‌పేట మండలంలోనే 26 మంది పాముకాటుతో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఏడుగురు విష నాగుల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది.ఇలా చేయాలి!పొలాల గట్లపై నడిచేటప్పుడు కర్రతో చప్పుడు చేయడం మంచిది. రాత్రి పూట పొలానికి వెళితే కచ్చితంగా టార్చ్‌లైట్ వినియోగించాలి.ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి.పాముకాటు బాధితులకు దైర్యం చెప్పాలి. భ యంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.కొందరు కాటు వేయగానే కత్తి, బ్లేడుతో గాట్లు పెడుతుంటారు. అలాంటివి చేయకూడదు.గాయం పైభాగాన్ని వస్త్రంతో గట్టిగా కట్టి ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.ఆస్పత్రికి తీసుకెళ్లాలిపాముకాటుకు గురైన వెంటనే ఆస్పత్రికి తరలించాలి. నాటువైద్యం పేరుతో జాప్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. ప్రభుత్వాస్పత్రు ల్లో యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి వీలైనంత త్వరగా చేరిస్తే ప్రాణాలు కాపాడగలం.– పి.సాయికుమార్ వైద్యాధికారి, హిరమండలం -
కుప్పలు కుప్పలుగా పాములు
దూరంగా వెళ్లే ఒక్క పామును చూస్తేనే ఒళ్లు భయంతో జలదరిస్తుంది. అలాంటి ఇళ్ల ముందే అనేక సర్పాలు కనిపిస్తే చెమటలు పట్టాల్సిందే. బెంగళూరు సమీపంలో నెలమంగల పట్టణంలో ఇలాంటి సమస్యే ఏర్పడింది. ఇళ్ల మధ్యలో కుప్పలుగా సర్పాలు తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేతెల్లిపోతున్నారు. ఇళ్ల లోపల, ముందు, కాంపౌండ్లలో, చెప్పుల స్టాండ్లలో, పొదల్లో ఇలా ఎక్కడ చూసినా సర్పాలే దర్శనమిస్తున్నాయి. స్నేక్ క్యాచర్ విశ్వనాథ్ ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి బంధించి దూరంగా వదిలేస్తున్నాడు. ఎక్కువగా ప్రమాదకర రక్తపింజర, నాగుపాములు ఉంటున్నాయి. ఓ ఫాం హౌస్‌లోనే 20 పైగా రక్తపింజర పాముల పిల్లలు కనిపించగా వాటిని పట్టి బకెట్లో వేశారు. అలాగే నాగుపాము పిల్లలూ దొరికాయి. దేశంలోనే అత్యధిక విషం కలిగిన నాలుగు రకాల పాములు కూడా నెలమంగలో దొరికాయని విశ్వనాథ్ తెలిపాడు. ప్రజలు చాలా జాగ్రత్తా ఉండాలని ఆయన సూచించారు.- కర్ణాటక -
6 ఫీట్లు పొడవు.. 40 కిలోల బరువు.. కాటేస్తే ఖతమే!
ఈ చిత్రంలో ఉన్న రక్తపింజర పాము సుభాష్‌నగర్‌బస్తీలోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం వచ్చిదూరింది. బస్తీని ఆనుకుని అటవీప్రాంతం ఉండటంతో రక్త పింజర వచ్చినట్లు తెలుస్తుండగా దాని పొడవు 6 ఫీట్లు, బరువు 40 కిలోల వరకు ఉంది. ఈ పాము కాటేస్తే మనిషి బతికే అవకాశాలు ఉండవు. అంతటి ప్రాణాంతకమైన సర్పాన్ని స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్ పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు.ఈ చిత్రంలో పడగవిప్పి బుస కొడుతున్న నాగుపాము బెల్లంపల్లి బస్తీలో ఉన్న ఓ వాటర్ ప్లాంట్‌లో గురువారం వచ్చింది. 6 ఫీట్లకు పైగా పొడువు ఉన్న పామును పట్టుకోబోయిన సీనియర్ స్నేక్ క్యాచర్ దుర్గా రాజేష్‌ను అరగంటకు పైగా ముప్పు తిప్పలు పెట్టింది. ఆఖరుకు అతికష్టంగా పట్టుకున్నాడు. మంచిర్యాల జిల్లా: పురాతన బొగ్గుగనుల ప్రాంతం బెల్లంపల్లి సర్పాలమయంగా మారింది. నిత్యకృత్యంగా విషసర్పాలు విచ్చలవిడిగా సంచారం చేస్తున్నాయి. జననివాసాలు, ఇళ్ల పరిసరాలు, వీధులు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ స్వైరవిహారం చేస్తున్నాయి. రక్తపింజరలు, నాగుపాములు ఇళ్లలో వచ్చి తిష్ట వేస్తుండగా, తేళ్లు సైతం దూరుతున్నాయి. ప్రాణాంతకమైన సర్పాలు, తేళ్ల బెడద పురప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వీటి సంచారంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు కురుస్తుండటంతో పుట్టల్లోంచి పాములు, తేళ్లు బయటకు వస్తున్నాయి.ఏ బస్తీలో చూసినా..మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా వీటిలో సగానికి పైగా వార్డుల్లో పాముల ప్రభావం ఉంది. ముఖ్యంగా అటవీ, శివారుబస్తీలు, మూసివేతకు గురైన కార్మికవాడలు, తుమ్మ, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి చిత్తడిగా ఉన్న ప్రతీ ప్రాంతం కూడా పాములు, తేళ్లకు నిలయాలుగా మారాయి. శాంతిఖని, 65 డీప్, సుభాష్‌నగర్, నెంబర్–2 ఇంక్లైన్, రైల్వే రడగంబాల బస్తీ, అంబేడ్కర్ రడగంబాల బస్తీ, పెద్దనపల్లి, సుబ్బారావుపల్లి, కాల్టెక్స్ ఏరి యా, గంగారాం నగర్, గాంధీనగర్, కన్నాల బస్తీ, మధునన్ననగర్, టేకుల బస్తీ, 24 డీప్ ఏరియా, కొత్తబస్టాండ్ ఏరియా ఇందిరమ్మ కాలనీ, కాంట్రాక్టర్ బస్తీ, షంషీర్‌నగర్, రవీందర్‌నగర్, అంబేద్కర్‌నగర్, బెల్లంపల్లి బస్తీ, హన్మాన్ బస్తీ, అశోక్‌నగర్, బూడిదగడ్డ, బాబుక్యాంపు బస్తీ, గోల్‌బంగ్లాబ స్తీ తదితర కార్మిక, కార్మికేతర బస్తీల్లో పాములు, తే ళ్ల సమస్య స్థానికులను తీవ్ర వేదనకు గురిచేస్తోంది.వారం రోజుల్లో..పాముల్లో రక్త పింజర, తాచుపాములు ప్రమాదకరమైనవి. వీటి కాటుకు గురైతే ప్రాణాలు కోల్పోయే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అవి జన నివాసాల్లో సంచరిస్తుండడం గమనార్హం. కాల్టెక్స్, 65 డీప్ ఏరియా, శాంతిఖని, సుబ్బారావుపల్లి, గంగారాంనగర్, గోల్ బంగ్లాబస్తీ, నెంబర్–2 ఇంక్లైన్, సుభాష్‌నగర్ తదతర ప్రాంతాల్లో రక్త పింజరల ప్రభావం అ«ధికంగా ఉండగా ఇతర బస్తీల్లో నాగుపాములు సంచరిస్తున్నాయి. ఇళ్ల పరిసరాలు, గల్లీలు, వీధుల్లో పిచ్చిమొక్కలతో చిత్తడి వాతావరణం ఉండగా , కొన్ని బస్తీలను ఆనుకుని అటవీ ప్రాంతం ఉండటం, మూసివేతకు గురైన బొగ్గు గనులు పాములకు స్థావరాలుగా మారడంతో పాముల సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో ఏకంగా 30కిపైగా స్నేక్ క్యాచర్లు పట్టుకున్నట్లు సమాచారం. వీటిలో 15 వరకు రక్తపింజరలు ఉండగా మిగతా తాచుపాములు ఉన్నాయి. తేళ్లు కూడా లెక్కలేనన్నీ ఇళ్లలోకి వస్తున్నట్లు పురప్రజలు చెబుతున్నారు. పట్టుకున్న పాములను స్నేక్ క్యాచర్లు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచుల్లో వేసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలి పెడుతున్నారు. జననివాసాలకు చేరువలో ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, సర్పాల సమస్యను పరిష్కరించాలని పురప్రజలు కోరుతున్నారు. -
విషసర్పాలకే వణుకు పుట్టించే ధైర్యం.. వైల్డ్ వెంకట్
సాధారణంగా పాములంటే మనిషికి హడల్. ఆ భయంతోనే వాటిని విచక్షణా రహితంగా చంపేస్తుంటారు. అటువంటి విషపూరిత పాములను స్నేక్ కేచర్ సహాయంతో పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టడం, అవసరమైతే చికిత్సలు అందించడం చేస్తూ వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు కొందరు పశువైద్యులు. సర్ప వైద్యం, వైల్డ్ లైఫ్ మెడిసినల్ విధానంలో మండలంలో పనిచేస్తున్న ముగ్గురు పశువైద్యులు వన్య ప్రాణుల సంరక్షణ మిషన్‌తో పాములకు రక్షకులుగా మారారు. కరుణ, ధైర్యం, అంకిత భావానికి స్ఫూర్తిదాయకంగా విష జంతువులకు హాని చేయకుండా నివారిస్తూ చికిత్సలు చేస్తున్నారు. స్నేక్ క్యాచర్ సాయంతో... మండలంలో పశువైద్యాధికారులు శివకుమార్, సుదీప్, శివప్రసాద్ సర్పవైద్యంతో వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మాడుగులకు చెందిన స్నేక్ కేచర్ వెంకట్ కింగ్ కోబ్రా వంటి హానికరమైన పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కింగ్ కోబ్రా అంతరించిపోతున్న జాతులలో ఒకటి. అందువల్ల అటువంటి పాములను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని వైద్యాధికారి శివకుమార్ చెబుతున్నారు. మన పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే ఫారెస్టు అధికారికి సమాచారం అందిస్తే, వెంటనే రెస్క్యూ చేసి అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతారని తెలిపారు. పాములు అనేవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, పాములకు దెబ్బలు తగలితే ఆర్దోఫెడిక్స్, ఇతర అధునాతన శస్త్ర చికిత్సలు 60 వరకు రెండు సంవత్సరాల వ్యవధిలో చేపట్టామని వైద్యాధికారి శివకుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన పశువైద్య సర్జన్లు పెంపుడు జంతువులకు మించి తమ సేవలను ముఖ్యంగా పాములను రక్షించడానికి విస్తరించారు. భయం పోగొట్టేలా... విష జంతువుల పట్ల జనంలో భయం పొగొట్టడానికి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడం, పర్యావరణ సమతుల్యత గురించి అవగాహన కలి్పంచడం జరుగుతుంది. అలాగే వాటి వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా వాటి సహజ ఆవాసాలలోకి సురక్షితంగా మార్చబడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కోబ్రా రెస్క్యూ ఆపరేషన్‌లో చాలా సంవత్సరాల నైపుణ్యం ఉన్న మాడుగుల గ్రామానికి చెందిన పాము క్యాచర్ వైల్డ్ వెంకట్ దీనికి బలంగా మద్దతునిస్తున్నారు. సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్‌లో పశువైద్యులకు తోడ్పాటు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పశువైద్యులతో సమన్వయం చేసుకుని అనేక పాములను రక్షించడంలో సహాయ పడుతున్నారు. ప్రజల్లో ఆయా విష జంతువుల పట్ల భయం పోగొడుతున్నారు. వన్య ప్రాణులను రక్షించాలి వన్య ప్రాణుల సంరక్షణ చట్టం అమలులో భాగంగా విష జంతువులను పూర్తిగా సంహరించకూడదు. ప్రజలకు ప్రాణహాని ఉందని, వీటిని సంహరిస్తున్నారు.స్నేక్ కేచర్ సహాయంతో రెండు సంవత్సరాల వ్యవధిలో 60 పాములకు శస్త్ర చికిత్సలు నిర్వహించాం. పశు వైద్యశాలల్లో ఈ చికిత్సలు నిర్వహించాం. – కె. శివకుమార్, పశువైద్యాధికారి, కింతలి వల్లాపురం, మాడుగుల మండలం స్ఫూర్తిదాయకం స్నేక్ కేచర్ వెంకట్ ఎన్నో విష జంతువులను పొలాల్లో, ఇళ్ల వద్ద చాకచక్యంగా పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెడుతున్నారు. ఆయన సేవలు ప్రశంసనీయం. వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం పశువైద్యాధికారుల సేవలు ప్రశంసనీయం. – శోలం రమేశ్, మాజీ సర్పంచ్ శంకరం గ్రామం, మాడుగుల మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా -
చేతిలో పాముతో తాగుబోతు హుల్చుల్
-
వామ్మో.. కోబ్రా ఫ్యామిలీ రౌండప్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి
-
Viral Video: కాటేసిన పామును మెడలో వేసుకున్న వ్యక్తీ
-
కర్రీ పఫ్‌లో పాము
మహబూబ్ నగర్ జిల్లా: ఆకలిగా ఉందన్న పిల్లల కోసం ఒక మహిళ బేకరీలో కొని తీసుకొచ్చిన కర్రీ పఫ్ తింటుండగా.. అందులో పాము కనిపించడంతో హడలిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన ఈ సంఘటనపై సీఐ కమలాకర్ కథనం మేరకు.. పట్టణంలోని జౌఖీనగర్లో నివాసం ఉంటున్న శ్రీశైలమ్మ మంగళవారం సాయంత్రం కూతురు, కొడుకు కోసం శ్రీలక్ష్మి అయ్యంగార్ బేకరీలో పిల్లలకు ఒక ఎగ్ పఫ్, కర్రీ పఫ్ కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కర్రీ పఫ్‌ను తింటుండగా.. పంటికి ఏదో గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి కర్రీ పఫ్‌ను తెరిచి చూసి బిత్తరపోయారు. నిశితంగా పరిశీలించగా అందులో చనిపోయిన చిన్న పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళన చెందిన తల్లి శ్రీశైలమ్మ.. కర్రీ పఫ్‌ను తీసుకుని సంబంధిత బేకరీ దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. అయితే ఇవన్నీ మామూలేనని.. తమకు వచ్చిన కూరగాయల్లో చనిపోయిన పాము ఉండి ఉంటుందని బేకరీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితురాలు తన భర్త శ్రీశైలంతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చామని సీఐ తెలిపారు. -
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్‌లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్‌లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్‌లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది.పర్యాటకులకు అవగాహన కల్పింస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ -
కట్లపాము.. అది చచ్చిన పామైనా జాగ్రత్తగా ఉండాలే..
బుట్టాయగూడెం: వర్షాకాలంలో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టమైన పొదల సమీపంలో పాములు తరచూ సంచరిస్తుండటం సాధారణమే. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పాముకాటుకు గురికాక తప్పదు. గత వారం రోజుల్లో పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో పాము కాటు కేసులు ఎక్కువగా నమోదవుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా మండ్రకప్ప, తేలు కాటుకు గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఉంటుంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉంండాలని వైద్యులు సూచిస్తున్నారు. అన్ని పాములు ప్రమాదకరం కాదు మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు అంటున్నారు. నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి పాముల వల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సాధారణంగా 50 శాతంపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. పాము కాటేసిన వెంటనే వైద్యం చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు రక్తపింజర ఎక్కువగా అటవీప్రాంతంలో తిరుగుతుంది. ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందాలి. నాగుపాము నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని అంటారు. ముందుగా పాముకాటు వేసిన చోట వెంటనే కట్టు కట్టాలి. తదుపరి పాము కాటుకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ప్రధానంగా నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కట్లపాము కట్లపాము కాటువేసిన వెంటనే విషం రక్తంలో కలుస్తుంది. ప్రాణాపాయం ఎక్కువ. పాము కాటు వేసిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాలి. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే వైద్యం చేయిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించాలి ► పాముకాటుకు గురైన వారు ఎలాంటి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడికి గురైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ► పాము కాటువేయగానే గాయాల పైభాగంలో కట్టుకట్టాలి. ► ఏ పాము కాటు వేసిందో తెలుసుకొని యాంటీ వీనమ్(విషానికి విరుగుడు) తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ► రైతులు రాత్రిపూట పొలాలకు వెళ్ళేప్పుడు కాళ్ళకు చెప్పులు, టార్చిలైట్లతో పాటు శబ్దాలు చేసే పరికరాన్ని వెంట తీసుకుని వెళ్ళడం వల్ల పాముకాటు నుంచి రక్షించుకోవచ్చు. అప్రమత్తంగా ఉండాలి పాము నుంచి రక్షించుకునేందుకు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైతే యాంటివీనమ్ మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. కాటుకు గురైన వ్యక్తి శరీరంలో మార్పులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ ప్రవీణ్, పీహెచ్సీ వైద్యాధికారి, దొరమామిడి, బుట్టాయగూడెం మండలం -
ఒకే కుటుంబంలో ముగ్గురికి పాము కాటు
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు గురువారం తెల్లవారుజామున పాము కాటుకు గురయ్యారు. వీరిలో శ్రీనివాసులు(10) అనే బాలుడు శుక్రవారం మృతి చెందాడు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. బైలుప్పల బీసీ కాలనీలో బుర్నా గోవింద్, చంద్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు దొరస్వామి, బాలకృష్ణ సంతానం. వీరికి వివాహాలు అయినా ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉంటున్నారు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము ఇంట్లోకి ప్రవేశించి దొరస్వామి, అతని ఎనిమిది నెలల కుమారుడిని, అలాగే బాలకృష్ణ కుమారుడు శ్రీనివాసులును కాటు వేసింది. కుటుంబ సభ్యులు దొరస్వామి, ఎనిమిది నెలల బాలుడిని మాత్రమే పాము కాటు వేసిందని భావించి గురువారం తెల్లవారు జామున చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఇంటి దగ్గరే ఉన్న శ్రీనివాసులు పరిస్థితి విషమించింది. గమనించిన కాలనీ వాసులు వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. దొరస్వామి పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉండటంతో ఎమ్మిగనూరును నుంచి కర్నూలు ప్రభుత్వాస్పత్రి తరలించారు. ఎనిమిది నెలల బాలుడు క్షేమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. -
మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తకు పాము కాటు... పామును తొక్కి చంపేశారు...
కర్నూలు: రాత్రి మిద్దైపె నిద్రిస్తున్న భార్యాభర్తలను పాము కాటు వేయడంతో భార్య మృతి చెందగా, భర్త ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గుండ్రేవుల గ్రామంలోని పాత బీసీ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిన్న భాస్కర్, లక్ష్మి (38) దంపతులు సోమవారం రాత్రి భోజనం అనంతరం మిద్దైపె నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 11 గంటల అనంతరం గొల్ల చిన్న భాస్కర్‌ను పాము కాటువేయడంతో విదిల్చి పడేయగా పక్కనే ఉన్న లక్ష్మి కాలికి కాటు వేసింది. ఆమె కాలిని వదలకుండా పట్టుకోవడంతో ఇద్దరూ కలిసి పామును తొక్కి చంపేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సాయంతో వెంటనే కర్నూలు పెద్దాస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేని లక్ష్మి మృతిచెందగా చిన్న భాస్కర్ కోలుకుంటున్నాడు. లక్ష్మి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..? కారణం ఇదే..
Nagula Chavithi 2022: కార్తీక శుద్ధ చతుర్థికి నాగుల చవితి అని పేరు. ఈనాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం. మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి వున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో ‘పాము’ ఆకారంలో వుంటుందని యోగశాస్త్రం’ చెబుతోంది. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కుతూ, మానవునిలో ‘సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని, అదే పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని పండితులు చెప్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, పాములు
-
సర్ప సంరక్షకుడు క్రాంతి..
సాక్షి,జంగారెడ్డిగూడెం : పాము కనిపిస్తే మనకు ఒళ్లు జలదరిస్తుంది. వెంటనే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఆ యువకుడు మాత్రం పాము కనిపిస్తే చాలు దాన్ని ఎంతో సులువుగా పట్టుకుని ప్రజల నుంచి హాని కలగకుండా సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతాడు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి కుమార్‌ను అందరూ ఆ ప్రాంతంలో పాముల సంరక్షకుడిగా పిలుస్తారు. ఏటా జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజుని పురస్కరించుకుని స్నేక్ సేవియర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి గురించి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే ఆసక్తి డిగ్రీ వరకు చదివిన క్రాంతి చిన్నప్పటి నుంచి వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదనే ఆలోచనతో పెరిగాడు. ఎవరైనా వాటికి హాని కలిగిస్తే వారికి అవగాహన కల్పించేవాడు. చాలామంది పాములను చంపడం చూసి వాటిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. వాటిని సురక్షితంగా పట్టుకోవడంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్నంలో ఉన్న స్నేక్ సేవియర్ సొసైటీలో పాములపై రీసెర్చ్ మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో పేరుగాంచాడు. అనేక గ్రామాల్లో పర్యటించి పాముల్ని చంపకుండా ఎలా వాటి నుంచి రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతవరకు జనావాసాలు, ఇళ్ల మధ్యకు వచ్చిన 10,900 పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది క్రాంతి పేరే. 83869 84869, 80998 55153 నెంబర్లకు ఫోన్ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని సురక్షితంగా విడిచిపెడుతుంటాడు. పాములతో పర్యావరణానికి మేలు మొట్టమొదటి సారిగా కెనడాలో ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహించారు. పాములనేవి పర్యావరణానికి మంచి చేస్తాయని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 3,458 సర్పజాతులు ఉండగా.. వీటిలో కింగ్ కోబ్రా, తాచుపాము, పొడపాము, కట్లపాము, రక్తపింజర విషపూరితమైనవి. – చదలవాడ క్రాంతికుమార్, పేరంపేట -
పేదరికపు కాటు: ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు
తిరువంతపురం: ఆదిత్య పదేళ్ల పాపాయి. అమ్మానాన్న, తను మాత్రమే ఉన్నామనుకుంది. తమతోపాటు మరో ప్రాణి కూడా తమ ఇంటికి వస్తూ పోతూ ఉందని ఆ పాపాయికి తెలియదు. ఆ ప్రాణి ఓ రోజు నాన్న ఇంట్లో లేనప్పుడు వచ్చింది. ఐదవ తరగతి చదువుతున్న ఆదిత్య హోమ్‌వర్క్ చేసుకుని, అమ్మ పెట్టిన అన్నం తిని నేల మీద పరుపు పరుచుకుని నిద్రపోయింది. ఆమె పడుకున్న తర్వాత ఆ ప్రాణి ఎప్పుడు వచ్చిందో తెలియదు. వచ్చి పాపాయిని కాటేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు ఆదిత్య పడుకున్న పరుపు కిందకు దూరింది. తెల్లవారింది. ఆదిత్య ఎప్పటిలాగ నిద్రలేవలేదు. తల్లి సింధు ఆమెను నిద్రలేపుతుంటే బలవంతంగా కళ్లు తెరుస్తోంది, అంతలోనే కళ్లు మూతలు పడుతున్నాయి. ముఖం ఉబ్బి ఉంది. ఆదిత్య తల్లికి ఏదో అనుమానం వచ్చింది. రాత్రి ఏదో కుట్టినట్లు అనిపించిన మాట నిజమేనని, చీమ కాబోలని చెప్పింది ఆదిత్య. నిజానికి అది చీమ కాదు. పరిస్థితులు ఎదురుతిరిగినప్పుడు చలిచీమల చేత చిక్కి నిస్సహాయంగా ప్రాణాలు వదిలే విషసర్పం. ఆదమరిచి నిద్రపోతున్న ఆదిత్య దగ్గర తన ప్రతాపం చూపించిందా సర్పం. పాపాయిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ ఆమెను కాటేసినది అత్యంత విషపూరితమైన సర్పం. మనిషి ఒంట్లోకి చేరగానే నరాల మీద ప్రభావం చూపిస్తుంది. న్యూరోపెరాలసిస్‌కు దారి తీస్తుంది. ఆదిత్య పరిస్థితి మరింతగా విషమించడంతో శనివారం నాడు పుష్పగిరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు మార్చారు. ఆదిత్య ప్రాణాలు కాపాడడం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రం, కొల్లం జిల్లా, పాథనాపురం, అంబేద్కర్ కాలనీలో జరిగింది. ఇల్లు ఉంటే ఇలాగయ్యేది కాదు ఆదిత్య తండ్రి రాజీవ్ కంటికి మంటకి ఏకధాటిగా ఏడుస్తున్నాడు. నా బంగారు తల్లిని పొట్టనపెట్టుకున్నది పాము కాదు ప్రభుత్వం అంటున్నాడు. ‘‘మాకు పక్కా ఇల్లు ఇచ్చి ఉంటే మా పరిస్థితి ఇలాగయ్యేది కాదు. పక్కా ఇంటికోసం ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నప్పటికీ ప్రభుత్వానికి పట్టనేలేదు. ఇప్పుడు నా బిడ్డ బలయిపోయింది’’ అని కన్నీళ్ల పర్యంతం అవుతున్నాడు ఆదిత్య తండ్రి. అతడి ఆవేదనలో అర్థం ఉంది. ఆ కుటుంబం నివసిస్తున్న ఇల్లు అత్యంత దయనీయంగా ఉంది. బొంతరాళ్లను గోడలుగా పేర్చుకుని, పైన నీలం రంగు పాలిథిన్ పట్ట పరుచుకున్నాడు. గోడలకు ఉన్న రంధ్రాల నుంచి తేళ్లు, జెర్రుల వంటివి ఇంట్లోకి ప్రవేశించడం కష్టమేమీ కాదు. ఇప్పుడు ఏకంగా పామే వచ్చింది. పేదరికానికి పేగుబంధాన్ని బలి చేసింది. పైకి పాము కాటుగా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది పేదరికపు కాటు. పేదరికం మీద ప్రభుత్వ వేసిన నిర్లక్ష్యపు వేటు. -
బైక్‌లో దూరిన పాము
ఆత్మకూరు: ద్విచక్రవాహనంలో దూరిన ఓ పాము కలకలం రేపింది. గొరిదిండ్లకు చెందిన రాము శనివారం ఉదయం తన ద్విచక్రవాహనంలో ఆత్మకూరుకు బయల్దేరాడు. పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే బైక్ నడుపుతున్న రాము కుడిచేతి మీదకు ఒక పాము పాకుతూ వచ్చింది. బిత్తరపోయిన ఆయన వెంటనే బండి ఆపాడు. అయితే ఆ పాము డూమ్లోకి వెళ్లి బయటకు రాలేదు. సమీపంలోని మెకానిక్ వద్ద డూమ్ తెరిపించగా బయటకు వచ్చిన పాము స్థానికులపైకి వస్తుండటంతో అరవింద్ అనే వ్యక్తి కర్రతో దాన్ని చంపేశాడు. ఇంటి ముందు ద్విచక్రవాహనం ఉంచినపుడు పాము ఎక్కి ఉండొచ్చని భావిస్తున్నారు.


