సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలం షికారుగంజి జంక్షన్ సమీపంలో లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ తిరుపతితో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మృతులు బాడంగి మండలం గజరాయనివలస వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: చెన్నై విమానం రాజమండ్రికి మళ్లింపు


