ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు | Heavy Rains: Yellow Alert For Several Districts In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Sep 13 2026 7:26 AM | Updated on Sep 13 2026 10:16 AM

Heavy Rains: Yellow Alert For Several Districts In Andhra Pradesh

సాక్షి, విజయవాడ: ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచనను వాతావరణ శాఖ జారీ చేసింది. పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు యానాంలకు ఎల్లో అలర్ట్ జారీ  చేసింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. విజ­య­వాడలో వేకువజాము నుంచి దాదాపు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ­దురు గాలులు, ఉరుములు, మెరుపుల ధాటికి బెజవాడ వాసులు బెంబేలెత్తిపోయారు. పలు ప్రాం­తాలు జలమయమయ్యాయి.

ముఖ్యంగా బెం­జిసర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు భారీ స్థా­యిలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అం­తరాయం కలిగింది. ఏలూరు రోడ్డులోనూ ఇ­దే పరిస్థితి నెలకొంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కో­నసీమ జిల్లాలోనూ శనివారం వేకువజామున భారీ వర్షం కురిసింది. ఉ.8 గంటల వరకు జిల్లాలో సగటున 37.4 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.

పి.గన్నవరంలో అత్యధికంగా 60.0 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ గంగవరం వద్ద గిరి­జనులు నిర్మించుకున్న తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఒడి­శా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాలకు బా­హ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఇదీ చదవండి: చవితి పూట.. ధరల మంట

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement