తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌ | IMD Heavy Rain Alert To Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్‌

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 8:05 AM

IMD Heavy Rain Alert To Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఆదివారం ఉదయం కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి-భువనగిరి, జనగామ, వరంగల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్‌, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ విధించారు. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీల్లో ఉదయం నుంచి 9 గంటల మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాత్రంతా భారీ వర్షాలు కురిసిన యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్‌, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, నల్గొండలోని కట్టంగూర్‌ ప్రాంతాల్లో మరో రెండు గంటల పాటు మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. 

మెదక్‌, సిద్దిపేట, మెద్చల్‌-మల్కాజిగిరి, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని మోస్తరు జల్లులు కొనసాగే అవకాశం ఉండగా.. దక్షిణ హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక గత 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 120–200 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదైందని తెలంగాణ వెదర్‌మ్యాన్‌ పేర్కొన్నారు. యాదాద్రి-భువనగిరి, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, భద్రాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొంతవరకు మెరుగుపడ్డాయని తెలిపారు. రాబోయే రోజుల్లో దక్షిణ తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇదీ చదవండి: వడివడిగా ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement