ఆ యాప్‌రం ఎక్కువే! | Extra Marital Dating app in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ యాప్‌రం ఎక్కువే!

Sep 13 2026 6:23 AM | Updated on Sep 13 2026 6:23 AM

Extra Marital Dating app in Hyderabad

వివాహేతర సంబంధాల యాప్‌ 

వినియోగంలో టాప్‌–5లో హైదరాబాద్‌

డేటా దుర్వినియోగం, సైబర్‌ నేరగాళ్ల 

ముప్పు పొంచి ఉందంటున్న పోలీసులు

సమస్యలకు ఇలాంటి యాప్‌లు పరిష్కారం కాదంటున్న మానసిక వైద్య నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: వివాహేతర సంబంధాల యాప్‌ల వినియోగంలో దేశంలోని టాప్‌–5 నగరాల్లో హైదరాబా­ద్‌ ఉన్నట్లు తేలింది. డిస్క్రీషన్‌ డేటింగ్‌(రహస్య డేటింగ్‌) పేరిట వివాహేతర సంబంధాలు ఏర్పరు­చు­కోవడానికి కెనడాకు చెందిన ఓ యాప్‌ అడ్డాగా మారింది. తాజాగా ఆ విదేశీ యాప్‌ సంస్థ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 5 లక్షల మందికిపైగా యాక్టివ్‌ యూజ­ర్లు ఉండగా.. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 1.10 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. 

యూజర్ల సంఖ్య ఆధారంగా దేశంలోనే టాప్‌–5 నగరాల్లో భాగ్యనగరం ఉందని కంపెనీ పేర్కొంది. ఐటీ కారిడార్లు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌ ప్రాంతాల నుంచే 60 శాతం ట్రాఫిక్‌ తమ యాప్‌నకు వస్తోందని వెల్లడించింది. మొత్తం యూజర్లలో 68 శాతం మంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారు ఉంటున్నారట. కొన్ని నివేదికల ప్రకారం..ఈ యాప్‌ కొత్త సబ్‌స్క్రైబర్లలో భారత్‌ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది.

యాప్‌ ఫీచర్లలో గోప్యత
ఇండియా యూజర్‌ ట్రెండ్స్‌ అండ్‌ డేటా ప్రైవసీ నివేదిక ప్రకారం.. ఈ యాప్‌ అందించే రహస్య ఫీచర్లు వినియో­గదారులను ఆకర్షిస్తున్నాయి. ఫొటోలను బ్లర్‌ చేసుకొనే అవకాశం ఉండటం, క్రెడిట్‌ కార్డులతో చెల్లింపుల విధానం, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లలో యాప్‌­పేరు కనిపించకుండా బిల్లింగ్‌ చేయడం వంటి సెక్యూరి­టీ ఫీచర్లు ఉండటం వల్ల ఇది ఇలాంటి కార్యక­లాపాలకు పాల్పడేవారికి ఆకర్షణీయంగా మారుతోంది.

పోలీసులు, సైబర్‌నిపుణుల హెచ్చరికలు
డేటింగ్‌ యాప్‌ల కోసం వెంపర్లాడే వారి­ని సైబ­ర్‌­నేరగాళ్లు బెదిరించి దోచుకొనే ప్రమాదం ఉందని సైబర్‌­ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్‌ క్రై మ్‌ గణాంకాల ప్రకారం డేటింగ్‌ యాప్‌ల­కు సంబంధించిన ఫిర్యాదులు మూడేళ్లలో 40% పెరిగాయి. మరోవైపు డిజిటల్‌ గోప్యతకు 100% గ్యారంటీ ఉండదని, బ్లాక్‌మె­యిల్, ఆర్థిక మోసాల ప్రమాదం ఉందని సైబర్‌ నిపుణులు హెచ్చరి­స్తున్నా­రు. వివాహేతర సంబంధాల వల్ల సామాజికంగా, మానసికంగా ఎదు­ర­య్యే పరిణామాలపై అవగాహన పెంచుకో­వాలని  మానసిక వైద్య నిపుణులు సూచి­స్తున్నారు. వైవాహిక బంధాలు బలహీన­పడ్డాయని డేటింగ్‌యాప్‌లను ఆశ్రయించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement