ఔను.. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారు | Jayam Ravi Reunites With Singer Keneeshaa For Ordinary Man Movie | Sakshi
Sakshi News home page

Jayam Ravi: అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు

Sep 11 2026 10:43 AM | Updated on Sep 11 2026 11:21 AM

Jayam Ravi Reunites With Singer Keneeshaa For Ordinary Man Movie

తమిళ హీరో రవి మోహన్‌ అలియాస్ జయం రవి గత కొన్నాళ్ల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. భార్య ఆర్తితో విడాకుల వ్యవహారమే దీనికి కారణం. మరోవైపు గాయని కెనీషాతో ఇతడి రిలేషన్ గురించి సాగుతున్న ప్రచారం కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఈ విషయమై దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న కెనీషా.. ఒక దశలో తమిళనాడు వదిలి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ చైన్నె వచ్చింది.

ఇప్పటివరకు గాయనిగా ఉన్న ఈమె.. ఇప్పుడు సంగీత దర్శకురాలిగా మారింది. అది కూడా రవి మోహన్‌ దర్శక నిర్మాతగా చేస్తున్న 'యాన్ ఆర్డినరీ మ్యాన్' సినిమా కోసమే. ఈ మూవీలో యోగి బాబు హీరో. ఈ చిత్రంతోనే కెనీషా సంగీత దర్శకురాలిగా పరిచయమవుతుండటం విశేషం. దీని గురించి స్పందించిన కెనీషా.. సరైన సమయంలో సరైన అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పుకొచ్చింది.

తొలుత ఈ సినిమాలో భాగం కాకూడదని అనుకున్నాను. రవి మోహన్‌ చెప్పిన యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌ స్టోరీ ఆర్టినరీనే అయినా అందులో విషయం మాత్రం ఎక్స్‌ట్రార్డినరి. ఈ చిత్ర కథనం ఇంప్రెస్‌ చేసింది. అందుకే సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను. దీనికి సంగీతమందించడం చాలా బాధ్యతతో కూడుకున్నది. చాలా రీసెర్చ్‌ చేసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నట్లు కెనీషా చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement