బిగ్‌బాస్ 10: చరణ్ ఎలిమినేట్.. కన్నీళ్లు తెప్పిస్తున్న చివరి మాటలు | Bigg Boss 10 Telugu Day 4 Episode 5, Sep 10th 2026 Full Episode Highlights: Charan Eliminated Mid-Week And Shalini–Chaitra Clash | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu Day 4 Highlights: వాళ్లు నన్ను బలి పశువుని చేయలేదు.. చరణ్ ఎమోషనల్

Sep 11 2026 9:28 AM | Updated on Sep 11 2026 9:49 AM

Bigg Boss 10 Telugu Day 4 Highlights Charan Eliminated

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ మొదలై నాలుగు రోజులు అయిపోయింది. మహాపరీక్ష పేరుతో ఇప్పటికే హోరాహోరీ పోటీ నడుస్తోంది. మరి నాలుగో రోజైన గురువారం(సెప్టెంబరు 10) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది? ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మిడ్ వీక్‌లోనే చరణ్ ఎలిమినేట్ అయిపోవడం, అతడి చివరి మాటలు ఎలా సాగాయనేది ఈ హైలైట్స్‌లో చూద్దాం.

బ్లాక్ షీప్ ఎవరు?
మహాపరీక్ష పేరుతో జరుగుతున్న పోటీ కోసం కంటెస్టెంట్స్ బ్లూ, రెడీ టీమ్స్‌గా విడిపోయారు. తాజా ఎపిసోడ్‌లో చెరో బృందం నుంచి ఇద్దరిని నిల్చోమని బిగ్‌బాస్ చెప్పగా బ్లూ టీమ్ నుంచి త్రిగుణ్, ముఖేశ్‌.. రెడ్ టీమ్ నుంచి రోహిత్, వంశీ వచ్చారు. మీ టీమ్‌లో మీరు ఎవరిని హై రిస్క్‌లో పెట్టాలనుకుంటున్నారో చెప్పమని అడగడంతో.. త్రిగుణ్, ముఖేశ్... కృష్ణుడిని, రోహిత్, వంశీ.. చైత్ర పేరు చెప్పారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన బిగ్‌బాస్.. ఈ నలుగురు కంటెస్టెంట్స్‌ని బయటకు పంపి 'హూ ఈజ్‌ ది బ్లాక్ షిప్' గేమ్ ఆడించారు. ఇందులో బ్లూ టీమ్ గెలిచింది.

షాలినీ-చైత్య మాటల వార్
అయితే ఈ గేమ్‌లో బ్లూ టీమ్ సరిగా ఆడలేదని రెడ్ టీమ్‌కి చెందిన రోహిత్ ప్రశ్నించగా.. కృష్ణుడి పేరు బ్లూ టీమ్ సరిగా రాయకపోవడంతో ఓడిపోయారు. చైత్ర పేరుని రెడ్ టీమ్ సరిగా రాసి టాస్క్‌లో గెలిచారు. అలా రోహిత్, వంశీ పర్మినెంట్ హౌస్‌మెట్స్ అయిపోయారు. ఈ సందర్భంగా షాలినీ.. ఏదైనా పాట పెట్టమని బిగ్‌బాస్‌ని అడిగింది. చైత్ర ఓవైపు హై రిస్క్‌లో ఉంటే డ్యాన్సులు కావాలా అని రాంప్రసాద్ అడగడంతో షాలినీ-చైత్ర మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఇద్దరూ మాటమాట అనుకున్నారు. చివరకు షాలిని ఏడ్చేసింది. దీంతో అంతా వెళ్లి ఆమెని ఓదార్చారు.

త్రిగుణ్ వర్సెస్ రోహిత్
కిచెన్‌లో గిన్నెలు తోమలేదని త్రిగుణ్‌ని రోహిత్ పిలిచి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా ఒకరికిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అగ్రిపరీక్ష నుంచి చీప్‌గా వచ్చేశారు, నీ బాడీ మొత్తం మత్తు పదార్ధాలతో తయారైంది అని త్రిగుణ్, రోహిత్‌ని తక్కువ చేసి మాట్లాడాడు. రోహిత్‌ని డొల్లరాజా డొల్లరాజా అని పాట కూడా పాడి త్రిగుణ్ ఉడికించాడు.

చరణ్ ఎలిమినేట్
హై రిస్క్‌లో ఉన్న రాంప్రసాద్, చైత్య, చరణ్‌ని పిలిచిన బిగ్‌బాస్.. ముగ్గురు మాట్లాడుకొని ఒకరు నామినేట్ అవ్వకుండా హై రిస్క్‌లో ఉంటూనే ఇంట్లో ఉంటారు అది ఎవరో మీరు నిర్ణయించుకోండి అని ఆదేశిస్తాడు. దీంతో చైత్ర లోపల ఉండాలని చరణ్.. రాం ప్రసాద్ లోపల ఉండాలని చైత్ర.. చైత్ర ఉండాలని రాం ప్రసాద్ చెప్పారు. దీంతో చైత్ర ఇంట్లోకి వెళ్లిపోయింది. మిగిలిన రాంప్రసాద్, చరణ్‌లో ఎవరు ఇంట్లో ఉండకూడదో వాళ్ల ముఖంపై పెయింట్ పూసి చెప్పాలని బిగ్‌బాస్.. మిగిలిన కంటెస్టెంట్స్‌ని ఆదేశించాడు. ఈ ప్రొసెస్‌లో తక్కువ ఓట్లు పడిన చరణ్.. మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు.

కన్నీళ్లు తెప్పించిన చరణ్
ఎలిమినేట్ అయిన తర్వాత మాట్లాడిన చరణ్ తెగ ఎమోషనల్ అయిపోయాడు. నేను వెళ్లిపోతానని కాదు గానీ జరిగింది నాకు నచ్చలేదు. నలుగురు అగ్నిపరీక్ష వాళ్లు నాకు ఓటేశారు. ఝాన్సీ నాకు ఓటు వేయలేదు. థ్యాంక్స్ ఇది గ్రూప్ గేమ్ కాదని నిరూపించినందుకు. నన్ను రాంప్రసాద్ అన్నని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరికీ నేను కొంచెం తక్కువగా కనిపిస్తా. మా టీమ్ నా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వాళ్లు నన్ను బలి పశువుని చేయలేదు అని భావోద్వేగానికి గురయ్యాడు. అలా నాలుగో రోజు ఆట ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement