బిగ్‌బాస్‌లో ఛాన్స్‌మిస్‌​.. రాజకుమారి పరిస్థితి ఇదా..? | Rajakumari Dayana Shares Emotional Video Over Social Media Trolls | Sakshi
Sakshi News home page

Bigg Boss10 Telugu: రాజకుమారి పరిస్థితి ఇంత దారుణమా..?

Sep 9 2026 7:48 PM | Updated on Sep 9 2026 8:26 PM

Rajakumari Dayana Shares Emotional Video Over Social Media Trolls

బిగ్‌బాస్‌ సీజన్‌ 10 తెలుగులో బిగ్‌బాస్‌ అగ్ని పరీక్ష సీజన్‌ 2తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్‌ రాజకుమారి దయాన. కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో పోటీ చేసిన ఆమె.. తనదైన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఫిజికల్‌ టాస్కుల్లో వెనకడుగు వేయకుండా పోరాడిన తీరు.. జడ్జీలతో పాటు ఆడియన్స్‌ను కూడా మెప్పించింది. దీంతో బిగ్‌బాస్‌ మెయిన్‌ హౌస్‌లో ఆమెకు చోటు ఖాయమని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ఆ అవకాశం దక్కలేదు. ( ఇదీ చదవండి: ఇక రిటైర్‌ కావాలనుకుంటున్నా: అమితాబ్‌ బచ్చన్‌)

పిల్లలతో ఉన్న ఓ వీడియో..
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌ అవకాశం కోసం తన వ్యక్తిగత జీవితంలోని విషయాలను బయటపెట్టారంటూ కొందరు ఆమెను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ‘సింపతీ స్టార్‌’ అంటూ విమర్శలు చేయడంపై రాజకుమారి దయాన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పిల్లలతో ఉన్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. తాను ఎదుర్కొంటున్న బాధను చెప్పుకొచ్చారు.

‘సింపతీ స్టార్‌’ అంటూ రాబందుల కన్నా దారుణంగా..
‘హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి నా పిల్లల పరిస్థితి చూసి చాలా బాధేసింది. ‘సింపతీ స్టార్‌’ అంటూ రాబందుల కన్నా దారుణంగా నన్ను పొడుచుకు తిన్నారు. నేను ఏం తప్పు చేశాను? నాకే అర్థం కావట్లేదు అండి. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోలేదు. కానీ నా గురించి మాట్లాడిన మాటలు, నాపై వేసిన నిందలు అన్నీ వింటుంటే… ఒక మనిషిగా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. బయటికి ధైర్యంగా కనిపించినంత మాత్రాన మనసులో బాధ ఉండదని కాదు కదా. నేను కూడా ఒక మనిషినే అండి. నాకూ బాధ ఉంటుంది… నాకూ కన్నీళ్లు వస్తాయి. ఒక్కసారి నా పరిస్థితిని కూడా ఆలోచించండి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement