బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా తనను బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కార్యక్రమానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ షో 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా రాసిన బ్లాగ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా?
కొనసాగించడం కష్టంగా మారుతోంది
కార్యక్రమానికి వచ్చే కొందరు కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్లోని విషాదకర ఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అమితాబ్ పేర్కొన్నారు. వాళ్లు పడిన బాధలను పంచుకుంటున్నప్పుడు నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నాకు కష్టంగా ఉంటోంది. హోస్ట్‌గానూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కష్టంగా మారుతోంది. ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా.. ఇప్పటికే ఆలస్యమైంది.’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఇక KBC నుంచి తప్పుకోనున్నారా? అనే చర్చ మొదలైంది.
ఇదీ చదవండి: మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను
2000లో ప్రారంభమైన KBCకి తొలి సీజన్ నుంచి అమితాబ్ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మూడో సీజన్‌కు మాత్రం షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గతంలోనూ అమితాబ్ KBC నుంచి తప్పుకోనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ( విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..)


