కళ్యాణం కమనీయం జీవితం పెద్ద విజయం సాధించాలి: వి.వి. వినాయక్‌ | Kalyanam Kamaneeyam Jeevitham Trailer Out, Team Promises A Clean Family Entertainer, Check Details Inside | Sakshi
Sakshi News home page

కళ్యాణం కమనీయం జీవితం పెద్ద విజయం సాధించాలి: వి.వి. వినాయక్‌

Sep 9 2026 3:18 PM | Updated on Sep 9 2026 4:02 PM

Kalyanam Kamaneeyam Jeevitham Movie Trailer Release Highlights

ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్, నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు.

డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ఈ సినిమా చిన్నదే గానీ సినిమా తీసిన వాళ్లు చిన్న వాళ్లు కాదు. ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడికి అవకాశం కల్పించినందుకు ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు, కిషోర్ కి మా డైరెక్టర్స్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా. మా సత్యనారాయణ రెడ్డి గారికి మంచి మిత్రులు రాజవంశీ ఈ సినిమాను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి. అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మూవీలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు, గుర్తింపు రావాలి. ఈ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్స్ గారికి మరిన్ని మూవీస్ చేసే బలం చేకూరాలని కోరుకుంటున్నా’ అన్నారు.

హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ - ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఒక జంట తమ బంధాన్ని విడిపోకుండా చూసుకోవాలి అనే మంచి పాయింట్ తో మా సినిమాను డైరెక్టర్ రవి గారు తెరకెక్కించారు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ మూవీ ఇది. మంచి కథ, కథనం, మ్యూజిక్, పర్ ఫార్మెన్స్ లు, టెక్నికల్ గా క్వాలిటీ అన్నీ మా సినిమాలో చూస్తారు.  ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మా మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ నెల 18న థియేటర్స్ లో మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా’అన్నారు.

హీరోయిన్ సాహితీ అవంచ మాట్లాడుతూ..రైటర్ అరవింద్ గారు ఇచ్చిన ఒక మంచి ఐడియాతో మా మూవీ స్టార్ట్ అయ్యింది. ఆ పాయింట్ ను మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి బ్యూటిఫుల్ మూవీగా రూపొందించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సినిమాను నమ్మి స్ట్రాంగ్ గా నిలబడిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా. వాళ్లు మా లాంటి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు. ఇలాంటి మంచి మూవీలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. మంచి కథ ఉంటే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మీ ఆదరణ పొందుతుంది. ఈ నెల 18న థియేటర్స్ కు రండి. మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement