బిగ్‌బాస్‌లో రాంప్రసాద్‌, చరణ్‌లకు షాక్‌! ఎలిమినేట్‌ అవుతారా? | Bigg Boss 10 Telugu High Risk Zone Tension Ram Prasad and Charan Face Elimination Threat | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: రాంప్రసాద్‌, చరణ్‌లకు షాక్‌! ఎలిమినేట్‌ అవుతారా?

Sep 9 2026 2:40 PM | Updated on Sep 9 2026 2:53 PM

Bigg Boss 10 Telugu High Risk Zone Tension Ram Prasad and Charan Face Elimination Threat

ఈరోజు బిగ్‌బాస్‌10 హౌస్‌లో హైరిస్క్‌ జోన్‌ టాస్క్‌ ఉత్కంఠ రేపనుంది. రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరిని హైరిస్క్‌లో పెట్టాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. హైరిస్క్‌లో ఉన్నవారు ఈ వారంలో ఎప్పుడైనా ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.
ఎలాంటి వాదనలు, ఆర్గ్యుమెంట్స్‌ లేకుండానే బ్లూ టీమ్‌ నుంచి రాంప్రసాద్‌ హైరిస్క్‌ జోన్‌లోకి వెళ్లేందుకు అంగీకరించాడు. అందుకు కారణం ఏంటని అడగగా.. శనివారం చెప్తా అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో తమ టీమ్‌ తరఫున రాంప్రసాద్‌ను హైరిస్క్‌లో పెడుతున్నట్లు నరేశ్‌ బిగ్‌బాస్‌కు తెలిపాడు.

ఎమోషనల్‌ వాతావరణం..
ఇక రెడ్‌ టీమ్‌ నుంచి చరణ్‌ను యూనానిమస్‌గా ఎంపిక చేసినట్లు రోహిత్‌ ప్రకటించాడు. అయితే అంతకుముందే త్రిగుణ్‌.. రోహిత్‌ హైరిస్క్‌లోకి వెళ్లడని టీమ్‌ సభ్యులతో చెప్పడం ఆసక్తికరంగా మారింది. చివరకు రోహిత్‌ కాకుండా చరణ్‌ హైరిస్క్‌ జోన్‌లోకి వెళ్లాడు.
ఇదీ  చదవండి: సందీప్‌రెడ్డికి విజయ్‌ దేవరకొండ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌.. వీడియో వైరల్‌
మరోవైపు.. ‘హైరిస్క్‌లో ఉంటాను.. అక్కడి నుంచి ఎలాగైనా బయటికి వస్తా అంటూ రాంప్రసాద్‌ బిగ్‌బాస్‌ ముందు ఎమోషనల్‌ అయ్యాడు. చరణ్‌తో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ఒక్కరు నీకు సపోర్ట్‌ చేసినా.. నీ కోసం నేను పోరాడేవాడిని’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు జరగబోతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఎక్కువమంది చదివింది: ఓ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పిలిచి మరీ వెక్కిరించాడు: ఐశ్వర్య లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement