‘పిఠాపురంలో… అలా మొదలైంది’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! | Pithapuramlo Ala Modalaindi Movie Release Date Fix | Sakshi
Sakshi News home page

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Sep 9 2026 8:29 AM | Updated on Sep 9 2026 8:29 AM

Pithapuramlo Ala Modalaindi Movie Release Date Fix

‘‘ప్రేమ, హాస్యం, సెంటిమెంట్, తండ్రీకూతుళ్ల అనుబంధం వంటి అంశాలతో పాటు యువతకు ఒక మంచి సందేశాన్ని అందించేలా ‘పిఠాపురంలో అలా మొదలైంది’ సినిమాను రూపొందించాం’’ అని మహేష్‌ చంద్ర తెలిపారు. ఆయన దర్శకత్వంలో పృథ్వీరాజ్, కేదార్‌ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పిఠాపురంలో  అలా మొదలైంది’. 

చంద్ర సినిమా టీమ్, ఎవర్‌ గ్రీన్‌ ఎపిక్‌ సినిమా పతాకాలపై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్‌ పటేల్, ఎఫ్‌.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 18న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. అలాగే ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోందని కూడా పేర్కొన్నారు. ‘‘ఇరుముడి, విశ్వనాథ్‌ అండ్‌ సన్స్, మా ఇంటి బంగారం’ సినిమాల తరహాలోనే మా సినిమా కూడా కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలి΄ారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement