‘మా అన్నలో బాగా నచ్చిన క్వాలిటీ ఇదే..’ | Epic Pre Release Event Anand Devarakonda Comments About Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

Epic Movie: ‘మా అన్నలో బాగా నచ్చిన క్వాలిటీ ఇదే..!’

Sep 8 2026 9:09 PM | Updated on Sep 8 2026 9:19 PM

Epic Pre Release Event Anand Devarakonda Comments About Vijay Devarakonda

'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. ఇటీవలే ట్రైలర్‌ విడుదల కాగా మంచి స్పందన అందుకుంది. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది.  ఈ మేరకు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయ్‌ దేవరకొండ, సందీప్‌ రెడ్డి వంగతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆనంద్‌ దేవరకొండ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.
 చదవండి: ‘నాతో పెట్టుకోవద్దు!’.. ఆటో రాంప్రసాద్‌ వార్నింగ్‌

ఇవే నేర్చుకున్నా..
‘విజయ్‌ దేవరకొండలో మీకు నచ్చిన అంశం ఏంటి’ అని యాంకర్‌ సుమ ఆనంద్‌ దేవరకొండను అడిగారు. ఆయన బదులుగా.. ‘మా అన్న దేనికీ భయపడరు. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అసలు ఆయన భయంతోనే బతకరు అదే మా అన్నయ్య నుంచి నేర్చుకున్నా’ అని ఆనంద్‌ దేవరకొండ చెప్పారు. దీంతో అక్కడ ఉన్న విజయ్‌దేవరకొండ అభిమానులు సంబరపడ్డారు. 

రణబాలి టీజర్‌..
కాగా టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాయన్ దర్శకుడు. ఈ సినిమా అక్టోబర్‌ 16 ఈ సినిమా విడుదల  కానుంది. ఈ క్రమంలో రేపు (సెప్టెంబర్‌ 9) టీజర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  ఇప్పటికే ప్రకటించింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement