జస్ట్‌ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్‌! | No Water In Hostel Student Went To Friend House For Bath Saved Him | Sakshi
Sakshi News home page

Delhi building collapse జస్ట్‌ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్‌!

Sep 8 2026 3:10 PM | Updated on Sep 8 2026 3:11 PM

No Water In Hostel Student Went To Friend House For Bath Saved Him

Delhi building collapse ఢిల్లీలోని ఐదంతస్తుల పేయింగ్ గెస్ట్ (PG) భవనం కుప్పకూలి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర విషాదాన్నినింపింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ఒక విద్యార్థి  తృటిలో తప్పించు కున్నాడు.  ఈ ప్రమాదం జరగడానికి కేవలం 15 నిమిషాల ముందు, మోతీలాల్ నెహ్రూ కాలేజీకి చెందిన 18 ఏళ్ల మొదటి సంవత్సరం విద్యార్థి సనా వర్ష్ (Sana Varsh) ప్రాణాలతో బయటపడ్డాడు.

నైరుతి ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఉన్న విద్యుత్, నీటి కొరతతోపాటు, పూర్తి లోపభూయిష్టంగా ఉన్న ఈ భవనంలోని నల్లాలో నీళ్లు రాకపోవడంతో అతినికి పెద్ద ముప్పు తప్పింది. మూడో అంతస్తులో ఉంటున్న వర్ష్, స్నానం చేయడానికి వెళ్లగా నల్లాలో నీళ్లు రాలేదు. దీంతో ఫ్రెష్ అవ్వడానికి సమీపంలోని తన స్నేహితుడి గదికి వెళ్లాడు. వర్ష్ గది నుంచి బయటకు వచ్చిన 15 నిమిషాల వ్యవధిలోనే ఆ భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒక్క  క్షణం అతను భయంతో వణికిపోయాడు. "ఒకవేళ నల్లాలో నీళ్లు వచ్చి ఉంటే, నేను కూడా ఆ శిథిలాల కిందే పూడిపోయి ఉండేవాడిని" అని పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ విద్యార్థి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అయితే భవనం కూలిపోవడంతో వర్ష్‌కు చెందిన విలువైన సర్టిఫికెట్లు, ముఖ్యమైన పత్రాలు, సామగ్రి అన్నీ శిథిలాల కింద చిక్కుకుపోయాయని విచారం  వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి: సౌండ్‌ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు

దాదాపు 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేదని వర్ష్  గుర్తు చేసుకున్నాడు. మెట్లు కూడా చాలా ఇరుకుగా, తేమగా ఉండేవని, ఈ బిల్డింగ్ ఏదో ఒకరోజు కూలిపోతుందనని స్నేహితులతో జోకులు వేసేవాడినని పేర్కొన్నాడు.  చివరిక ప్రమాదం జరిగిన రోజు ఉదయం నుంచే భవనం బేస్‌మెంట్ (నేలమాళిగ) నుంచి వింత శబ్దాలు వచ్చాయని కూడా చెప్పాడు.

ఇదీ చదవండి: నో జిమ్‌, సోషల్‌ మీడియాను ఊపేస్తున్న కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌?

మరోవైపు వర్ష్ గదిలో ఉండే నితీష్, నీరజ్ అనే ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో చి 12 మందిని సహాయక బృందాలు (NDRF, ఫైర్ సర్వీసెస్) కాపాడాయి. గాయపడిన వారి కుటుంబాలను, బాధితులను ఢిల్లీ ముఖ్యమంత్రి  రేఖా గుప్తా కలిశారు చికిత్స ఖర్చును NCT ప్రభుత్వమే భరిస్తుందని  ఆమె తెలిపారు. అలాగే, ఆ ​​పీజీ (PG) పక్కనే ఉన్న సురక్షితం కాని భవనాన్ని బుధవారం కూల్చివేస్తామని  ప్రకటించారు.

ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అర్పిత జజ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన యువరాజ్ సోని అనే విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దరూ రక్షాబంధన్ పండుగ జరుపుకోవడానికి కొన్ని రోజుల ముందే ఇళ్లకు వెళ్లి వచ్చారు. కానీ ఇంతలోనే తమ బిడ్డలు  తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతారని ఊహించని కుటుంబంలో శోకసంద్రంలో  మునిగిపోయాయి. 

ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్‌, దుబాయ్‌లో సింగర్‌ హఠాన్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement