ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గ‌న్ తుది జ‌ట్టు ఇదే! | Afghanistan Predicted Playing XI For-1st T20 Match Vs India | Sakshi
Sakshi News home page

ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గ‌న్ తుది జ‌ట్టు ఇదే!

Sep 7 2026 4:28 PM | Updated on Sep 7 2026 4:45 PM

Afghanistan Predicted Playing XI For-1st T20 Match Vs India

Photo Credit: Twitter

టీమిండియాతో టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప‌సికూన‌లం కాద‌ని ఇప్ప‌టికే నిరూపించుకున్న అఫ్గానిస్తాన్ టీమిండియాతో సిరీస్‌కు బ‌ల‌మైన జ‌ట్టుతో బ‌రిలోకి దిగాల‌ని చూస్తోంది. ఈ మేర‌కు త‌మ వ‌ద్ద ఉన్న బ‌ల‌మైన బ్యాటింగ్, బౌలింగ్ అస్త్రాల‌ను టీమిండియాపై ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. 

మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ఎంపిక చేసింది. ఆదివారం (సెప్టెంబ‌ర్ 13న‌) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌రగ‌నున్న నేప‌థ్యంలో ఆ జ‌ట్టు తుది కూర్పు ఎలా ఉంటుంద‌నేది ఒక‌సారి పరిశీలిద్దాం.

ఓపెన‌ర్లుగా ఆ ఇద్ద‌రే..
తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రహ్మ‌నుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రన్‌లు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తమ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించే బాధ్యతను ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తీసుకోనున్నారు. మరోవైపు ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్‌కు ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉండ‌డంతో అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. 

కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్ర‌న్ కూడా మంచి ఫామ్‌లో ఉండ‌డం ఆ జ‌ట్టుకు సానుకూలాంశం. ఇక వ‌న్‌డౌన్‌లో ద‌ర్విష్ ర‌సూలీ బ్యాటింగ్ చేసే అవ‌కాశ‌ముంది. కొంత‌కాలంగా టీ20ల్లో ఆఫ్గ‌న్‌కు కీల‌క బ్యాట‌ర్‌గా మారిన‌ రసూలీ 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో నాలుగు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.

మిడిలార్డ‌ర్ ఇలా..
సాదిఖుల్లా అటల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో పంపవచ్చు. అటల్ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్ అయిన‌ గుల్బదిన్ నైబ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. 2024 టీ20 సిరీస్‌లో నైబ్ తన బ్యాట్‌తో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. 

ఈసారి కూడా అదే ప్ర‌ద‌ర్శ‌న‌ను పున‌రావృతం చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అజ్మతుల్లా ఉమ‌ర్‌జ‌య్ ఆరో స్థానంలో, సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ ఏడో స్థానంలో రానున్నారు. ఈ ఇద్ద‌రు అనుభ‌వ‌జ్ఞులు త‌మ ఫినిషింగ్ ట‌చ్‌తో భార‌త బౌల‌ర్ల‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నారు. ఇక జ‌ట్టు ఐకాన్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్‌తో పాటు నూర్ అహ్మ‌ద్ కూడా బ్యాటింగ్ చేయగ‌ల స‌త్తా ఉన్న‌వాళ్లే.

బౌలింగ్ ద‌ళం..
అఫ్గానిస్తాన్‌కు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ముజీబ్ ఉర్ ర‌హ్మాన్‌, ర‌షీద్ ఖాన్‌, నూర్ అహ్మ‌ద్ త్ర‌యం భార‌త్ బ్యాట‌ర్ల‌ను ఇబ్బంది పెట్ట‌వ‌చ్చు. తొలి టీ20కి ఈ ముగ్గురు అందుబాటులో ఉండ‌డం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జ‌ట్టులో ఏకైక స్పెష‌లిస్ట్ ఫాస్ట్ బౌల‌ర్‌గా ఫ‌జ‌ల్ ఫ‌రూఖీ ఉండ‌వ‌చ్చు. అత‌డికి తోడుగా అజ్మతుల్లా, గుల్బ‌దిన్ నైబ్‌లు కూడా బౌలింగ్‌తో ముప్ప‌తిప్ప‌లు పెట్టొచ్చు. 

ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌ద్ న‌బీ త‌న ఆఫ్ స్పిన్‌తో ఇబ్బందిపెట్ట‌గ‌ల స‌త్తా ఉన్న‌వాడే. మొత్తం మీద అఫ్గానిస్తాన్ జ‌ట్టు పేప‌ర్‌పై మాత్రం బ‌లంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌లే కాలంలో ఓట‌ముల‌ను అంత త్వ‌ర‌గా ఒప్పుకోని అఫ్గానిస్తాన్ జ‌ట్టు సొంత‌గ‌డ్డ‌పై దుర్భేద్యంగా క‌నిపిస్తున్న టీమిండియాను ఏ మేర‌కు నిలువ‌రించ‌గ‌లద‌నేది చూడాలి.

తొలి టీ20కి అఫ్ఘనిస్తాన్ తుది జట్టు అంచనా:
రహ్మ‌నుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రన్ (కెప్టెన్‌), దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్‌జ‌య్‌, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నూర్ అహ్మద్.

Read: రెస్ట్ తీసుకోమ‌న్నా విన‌లేదు; నొప్పిని భ‌రిస్తూనే డ‌బుల్ సెంచ‌రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement