రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్‌ : నెటిజన్లు ఫిదా | TGSRTC Conductor Saritha Returns Rs3 Lakh Cash Bag to Passenger in Hyderabad | Sakshi
Sakshi News home page

రూ. 3 లక్షల బ్యాగును అప్పగించిన మహిళా కండక్టర్‌ : నెటిజన్లు ఫిదా

Sep 7 2026 12:01 PM | Updated on Sep 7 2026 12:16 PM

TGSRTC Conductor Saritha Returns  Rs3 Lakh Cash Bag to Passenger in Hyderabad

సాక్షి, హైదరాబాద్:  హైదరాబాద్‌కు  చెందిన ఒక ఆర్టీసీ మహిళా కండక్టర్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. హజ్ యాత్రకు వెళ్తున్న ఒక జంట అఫ్జల్‌గంజ్‌లో బస్సు దిగుతుండగా పొరపాటున తమ డబ్బుల సంచిని బస్సులోనే మర్చిపోయారు. అయితే దీన్ని గుర్తించిన ఆర్టీసి ఉద్యోగిని, తిరిగి  ఆ బ్యాగును సంబంధిత వ్యక్తులకు అప్పగించడం విశేషంగా నిలిస్తోంది. అఫ్జల్‌గంజ్ వద్ద బస్సులో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పలు ప్రశంసలు దక్కించుకుంటోంది.  

వివరాలు  ఇన్నా ఉన్నాయి... షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త జహంగీర్ , ఆయన భార్య హైదరాబాద్‌ సిటీ బస్సు ఎక్కారు. అఫ్జల్‌గంజ్ వద్ద దిగిన ఆ తర్వాత, వారు నాంపల్లి వైపు వెళ్లారు ఆ హడావిడిలో, రూ. 3 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను  పొరపాటున బస్సులోనే వదిలివేశారు. కాసేపటికే తమ పొరపాటును గ్రహించిన ఆ దంపతులు ఆందోళనతో బస్సు స్టాండ్‌కు తిరిగి వచ్చారు.

అదే సమయంలో, TGSRTC కండక్టర్ సరిత (ఎంప్లాయి నంబర్: 152270) బస్సులో ఎవరూ లేని బ్యాగ్‌ను గమనించారు. ఆమె వెంటనే డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, ఆ నగదు సురక్షితంగా ఉండేలా చూశారు. ఇంతలో బ్యాగు పోగొట్టుకున్న జహంగీర్ , ఆయన భార్య బస్సు స్టాండ్‌కు  చేరారు.  దీంతో  సరిత, నరసింహులు ఆ రూ. 3 లక్షల నగదును వారికి అప్పగించారు. దీంతో వారి సంతోషానికి అవధుల్లేకుండాపోయింది.

ఇదీ చదవండి : నో ఫుడ్‌, నో మనీ : కట్‌ చేస్తే కంపెనీ సీఈవోగా

మరోవైపు కండక్టర్ నిజాయితీని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రయాణికుడి డబ్బును తిరిగి ఇచ్చినందుకు ఆయన సరితను అభినందించారు. నిజాయితీ, చిత్తశుద్ధితో బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ఇదొక  ఉదారణ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి  

ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement