లాటరీలో జాక్‌పాట్ తగలాలి, ఆ మొత్తంతో బంగ్లా,కారు, నగలు ఇలా ఎన్నో రకాల విలాసాలపై ఖర్చుపెట్టాలనే ఆశతోనే సాధారణంగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తారు ఎవరైనా కదా..! అలా ఒక దంపతులకు అనూహ్యంగా వేలకోట్ల రూపాయల విలువ చేసే లాటరీ దక్కించుకున్నారు. మరి ఆ ధనాన్ని వారు ఎలా ఖర్చుపెట్టారో తెలుసా? ప్రస్తుతం వీరి కథ వైరల్‌గా మారింది.
స్కై న్యూస్ ప్రకారం 2019లో ఫ్రాన్సెస్, ఆమె భర్త ప్యాడీ కాన్నోలీ పెద్ద మొత్తంలో యూరోమిలియన్స్ (EuroMillions) గెల్చుకున్నారు. ఫ్రాన్సెస్ కాన్నోలీ అనే రిటైర్డ్ టీచర్, సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ , టీచర్, పెద్దమొత్తంలో గెల్చుకున్నదీని ఏకంగా రూ. 1,470 కోట్లు. సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తే ఫ్రాన్సెస్ ఇక్కడే చాలా పెద్దమనసుతో ఆలోచించారు. తమ కుటుంబ అవసరాలు తీరిన తర్వాత, గెలుచుకున్న మొత్తం 115 మిలియన్ల పౌండ్లలో, సగానికి పైగా అంటే రూ. 632.5 కోట్లను ఛారిటీలకు, సంఘాలకు విరాళంగా అందించారు. అందించారు. దీనికోసం ఆమె 'PFC ట్రస్ట్' అనే స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేయడం విశేషంగా నిలుస్తోంది.
A Northern Irish National Lottery winner who has given away half of her £115 million winnings has said it is human nature to help others.
Frances Connolly has set up a charitable trust to support good causes since winning the enormous EuroMillions jackpot with husband Paddy in… pic.twitter.com/d9UQRdvJXv— The Irish News (@irish_news) September 6, 2026
అంతేకాదు ఇంత సంపద ఉన్నప్పటికీ, వీరు నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్‌లో నిరాడంబరంగా జీవిస్తున్నారు. విలాసాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా సెకండ్ హ్యాండ్ వాచీలు, వాడిన కార్లనే కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు.
ఇదీ చదవండి : నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా

గత నెలలో 80 ఏళ్ల వయసులో మరణించిన గాయని, ప్రముఖ సంగీత విద్వాంసురాలు , దాత డాలీ పార్టన్ (Dolly Parton) తన దాతృత్వానికి ఒక 'స్ఫూర్తి' అని ఫ్రాన్సెస్ అభివర్ణించారు. మిడిల్స్‌బ్రో వెలోడ్రోమ్‌లో "60 ఫర్ 60 ఛాలెంజ్"లో కూడా పాల్గొంది.
"మనకు తగినంత లభించినప్పుడు ఇతరులతో పంచుకోవడం మానవ నైజం" అంటారు ఆమె. తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉన్నప్పుడు, అనవసరంగా డబ్బును తన దగ్గరే ఉంచుకోవడంలో అర్థం లేదని ఆమె పేర్కొన్నారు.
ఉత్తర ఐర్లాండ్‌లో పెరిగిన ఫ్రాన్సెస్, 1990లో హార్ట్‌ల్‌పూల్‌కు మారారు. అక్కడ దాదాపు 25 ఏళ్లకు పైగా నివసిస్తూ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె 60వ పుట్టినరోజు సందర్భంగా ఈ ట్రస్ట్‌కు నిధులు సేకరించేందుకు ఏడుగురు అథ్లెట్లు పలు ఛాలెంజ్‌లలో పాల్గొంటున్నారు. సామాజిక సేవలో చురుగ్గా ఉంటూ, పూర్తి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
తన ట్రస్ట్ ద్వారా యువ సంరక్షకులు సరైన విరామం తీసుకోవడానికి వీలుగా విశ్రాంతి కారవాన్‌ను డొనేట్ చేసింది. ఇంకా ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం కొన్ని ప్రాజెక్టులు, డిజిటల్ టెక్నాలజీకి నిధులు సమకూర్చింది .అత్యవసర ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. స్థానిక క్రీడా క్లబ్‌లలో డీఫిబ్రిలేటర్లను ఏర్పాటు చేసింది.ఈ ట్రస్ట్ తరపున గ్రేట్ నార్త్ రన్‌లో పాల్గొన బోతున్న పాల్ హెవిట్సన్ తదితరులు సంతోషాన్ని ప్రకటించారు ఇది తమకు ఎంతో స్ఫూర్తి నిచ్చిందన్నారు.
ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు



