సాక్షి, చెన్నై : మద్యం, గంజాయి మత్తులో ఒక బాలుడి నుంచి మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళను వీధి కుక్కలు కాపాడిన ఘటన కోయంబత్తూరులోని తుడియలూరు వద్ద అశోకపురంలో వెలుగుచూసింది. ఓ దుకాణంలో అగ్నిప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్న సమయంలో ఈ సంచలన విషయం బయటపడింది. దీంతో ఆ కెమెరా దృశ్యాల ఆధారంగా ఆ బాలుడిని అరెస్టు చేశారు. వివరాలు..
అశోకపురం జీజీఓ కాలనీలోని ఒక దుకాణానికి గురువారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో తుడియలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేశారు. ఇందులో ఓ దృశ్యం పోలీసుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అశోకపురం ఫ్లైఓవర్ వద్ద ఒంటరిగా తిరుగుతూ ఉండే ఒక మానసిక వైకల్యంతో బాధపడే మహిళపై మద్యం, గంజాయి మత్తులో ఉన్న బాలుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు.
Street Dog in Tamil Nadu’s Coimbatore have become unlikely heroes after they intervened and saved a mentally ill woman from an alleged sexual assault attempt by a minor boy. 🐕#TamilNadu #India #Dog pic.twitter.com/LOE5ny0Q6m
— মৃত্যুঞ্জয়/姆里蒂尤恩贾伊/Mrityunjay 🇮🇳 (@VloggerCalcutta) September 4, 2026
బాధితురాలు కేకలు వేసినా అర్ధరాత్రి వేళ ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు తక్షణమే స్పందించాయి. ఆ బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. అతడి కాళ్లను కరుస్తూ అడ్డుకున్నాయి. కుక్కల దాడితో భయపడిన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, గణేష్ నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలల అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.


