దివ్యాంగ మహిళపై లైంగిక దాడికి యత్నం : తరిమి కొట్టిన వీధి కుక్కలు! | Woman With Mental Disability Allegedly Assaulted Stray Dogs Chase Away Attacker | Sakshi
Sakshi News home page

దివ్యాంగ మహిళపై లైంగిక దాడి యత్నం.. తరిమి కొట్టిన వీధి కుక్కలు!

Sep 4 2026 5:50 PM | Updated on Sep 4 2026 6:14 PM

Woman With Mental Disability Allegedly Assaulted Stray Dogs Chase Away Attacker

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన  మహిళను లైంగిక దాడి నుంచి వీధి కుక్కలు కాపాడిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో గురువారం తెల్లవారు జామున ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది.

నివేదికల ప్రకారం, రోడ్డు పక్కన నిద్రిస్తున్న మానసిక దివ్యాంగురాలైన మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. తుడియలూర్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఉన్న రైల్వే వంతెన కింద ఈ ఘటన జరిగింది. నిందితుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ, రోడ్డు పక్కన పడి ఉన్న ఆ మహిళను గమనించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించు కున్నాక, అతను ఆమెపై దాడికి యత్నించాడు. మానసిక వైకల్యంతో వీధుల్లో నివసించే ఆ మహిళ భయపడి, సహాయం కోసం కేకలు వేసింది. 

అయితే ఎవరూ రాలేదు. నిందితుడు ఆమెపై దాడిచేస్తున్నపుడు ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది.  కానీ చుట్టుపక్కల ఎవరూ లేరనేధైర్యంతో అతను తన పట్టువీడలేదు. అయితే, రోడ్డుపై ఉన్న రెండు వీధి కుక్కలు ఈ విషయాన్ని గమనించి  గట్టిగా అరవడం ప్రారంభిచాయి. మొరుగుతూనే అతని పైకి లంఘించాయి.  అయినా ఆమెను వదలకపోవడంతో, కుక్కలు అతనిపై ఎటాక్‌ చేసి మరీ అక్కడి నుంచి తరిమికొట్టాయి. ఈ దాడికి సంబంధించిన CCTV దృశ్యాలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత, లైంగిక దాడికి ప్రయత్నించిన ఆరోపణపై పోలీసులు భూపతి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు  నిస్పహాయురాలైన మహిళను కాపాడిన ఈ వీడియో చూసిన నెటిజన్లు వీధికుక్కల విశ్వాసాన్ని కొనియాడు తున్నారు. 

ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్‌ వీడియో


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement