ది వారియర్‌: 97 ఏళ్ల వయసులో ప్రాణం మీద ఆశే బతికించింది! | Kept Her Head Above Water she Became Face Of Survival in Nepal | Sakshi
Sakshi News home page

ది వారియర్‌: 97 ఏళ్ల వయసులో ప్రాణం మీద ఆశే బతికించింది!

Sep 3 2026 5:15 PM | Updated on Sep 3 2026 5:30 PM

Kept Her Head Above Water she Became Face Of Survival in Nepal

nepal flash flood నేపాల్‌లో ఆగస్టు 26వ తేదీ సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ కొన్ని వందల మందిని రక్షించినప్పటికీ భయంకరమైన వరదల్లో ఇప్పటివరకు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా బురదలో చిక్కుకున్న  97 ఏళ్ల వృద్ధురాలి గుణా మాయా బొహారా (Guna Maya Bohara) బయ JCB ఎక్స్‌కవేటర్ బకెట్‌లో సురక్షితంగా బయటకు తీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.అత్యంత తెగువతో ఈ విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడి ధైర్యానికి గొప్ప సంకేతంగా నిలిచారు.

నువాకోట్‌లోని దేవీఘాట్‌లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆశ్రమంలోని ఏడుగురు వృద్ధులు మరణించగా, ప్రాణాలతో బయటపడిన బొహారా సహా మిగిలిన వృద్ధులను ఖాట్మండులోని తాత్కాలిక పునరావాస కేంద్రానికి విమానంలో తరలించారు.  అక్కడ చికిత్స పొందుతున్న  ఆమెకు తీవ్రమైన ఒత్తిడి రుగ్మత (acute stress disorder) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ‘‘ఆ నీళ్ళు నన్నేఎందుకు ముంచెత్తాయి?" అనే ప్రశ్నను బొహారా అమాయకంగా, తీవ్రమైన ఆవేదనతో  పదే పదే  అడుగుతూనే ఉన్నారని  ఆమె సమీప బంధువు దీపక్ చెప్పారు.

ఇదీ  చదవండి: స్త్రీవాద దిగ్గజం, రచయిత్రి కన్నుమూత

నాలుగు గంటలపాటు.. తల ఎత్తి
వరద వచ్చిన సమయంలో బొహారా తన గదిలోనే ఉన్నారు. ఆమెకు ముందు నుంచే కాళ్లు పనిచేయవు.  దీనికి తోడు ఉధృతమైన నీటి ప్రవాహం వల్ల ఆమె చేతికి గాయమైంది, కానీ బ్రతకాలన్న సంకల్పమే ఆమెను ముందుకు నడిపించింది. ధైర్యపడకుండా గది కిటికీ తెరిచి, నీటిమట్టానికంటే ఎత్తుగా తన తలను ఉంచుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక వాలంటీర్లు 4 గంటల తర్వాత వచ్చి ఆమెను బురద నుంచి రక్షించారు. మరోవైపు  రాబోయే ప్రళయం గురించి తమను ఎవరూ సకాలంలో హెచ్చరించలేదని  మరో వృద్ధుడు వాపోయారు.

ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్‌ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు

బోహరాకు బాల్య వివాహాలు సర్వసాధారణంగా ఉన్న రోజుల్లో ఎనిమిదేళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. వయసు తన భర్త కంటే 81 సంవత్సరాలు ఎక్కువ జీవించారు.  ఆమెకు పిల్లలు లేరు.పెళ్ళైన ఎనిమిదేళ్ళకు తన భర్తను, ఆ తర్వాత నాలుగేళ్ళకు తన తల్లిదండ్రులిద్దరినీ; మరికొంత కాలానికి తన ఏకైక సోదరుడిని ఇలా ఇరవై ఏళ్ళ వయసు వచ్చేసరికి, తన రక్త సంబంధీకులలో దాదాపు అందరినీ ఆమె కోల్పోయింది.  ఆమె భర్త కుటుంబం, అతని ముగ్గురు సోదరులు, వారి భార్యలు, కాలక్రమేణా వారి పిల్లలు మాత్రమే మిగిలారు. ఆమె పదమూడు మంది మేనల్లుళ్ళను, పన్నెండు మంది మేనకోడళ్ళను సొంత పిల్లల్లా పెంచింది. ఆ కుటుంబంలో  ఆ తరంలో మిగిలి ఉన్న చివరి వ్యక్తి బోహారా. 

ఇదీ చదవండి: రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్‌

కాగా నేపాల్ వరదల్లో ఇప్పటివరకు 1,252 మంది మరణించగా, 4,216 మందికి పైగా గల్లంతయ్యారు. నేపాల్ ఆర్మీ,  సహాయక బృందాలు జలవిద్యుత్ ప్రాజెక్టుల టన్నెళ్లలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement