ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మెయిన్‌పురి జిల్లాలో ఒక గ్రామంలో, మూడు నెలల చిన్నారిపై 35 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన దిగ్బ్రాంతి రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం పొరిగింటిలో ఉండే, కుటుంబానికి తెలిసిన వ్యక్తి జితేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మంగళవారం రాత్రి వేళ ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న చిన్నారి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆ సమయంలో చిన్నారి తల్లి రాత్రి వంట పనిలో తండ్రి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పొరుగింట్లో ఉండే నిందితుడు జితేంద్ర, ఇంట్లోకి వచ్చి చిన్నారితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. తెలిసిన వ్యక్తి కావడంతో, వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సుమారు అరగంట తర్వాత నిందితుడు తిరిగి వచ్చి, చిన్నారిని మళ్లీ మంచంపై పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే పాప విపరీతంగా ఏడుస్తూండటంతో తల్లీ ఎత్తుకుని ఓదారుస్తుండగా, చిన్నారి జననేంద్రియాల నుండి తీవ్ర రక్తస్రావం అవుతుండటాన్నిగమనించి ఒక్కసారిగాఉలిక్కిపడింది. గట్టిగా కేకలు వేసింది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారని బేవార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనిల్ కుమార్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు
కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు, అక్కడి వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో సాయిఫై మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందు తోందని పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి తండ్రి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారు


