400 మీటర్లు ఒంటికాలితో గెంతుతూ : ఏడేళ్ల రాగిణి హృదయ విదారక స్టోరీ వైరల్‌ | 7 year old UP girls determination to go to school sparks massive support online | Sakshi
Sakshi News home page

400 మీటర్లు ఒంటికాలితో గెంతుతూ : ఏడేళ్ల రాగిణి హృదయ విదారక స్టోరీ వైరల్‌

Sep 2 2026 6:01 PM | Updated on Sep 2 2026 6:30 PM

7 year old UP girls determination to go to school sparks massive support online

సాక్షి, లక్నో:  ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన ఏడేళ్ల బాలిక నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణంగా చిన్నారులు సరదాగా  గెంతుతూ ఎగురుతూ బడికి వెళ్లడం మనం చూసి ఉంటాం. కానీ  దురదృష్టవశాత్తూ ఈ బాలికకు బాధతో కుంటుకుంటూ వెళ్లక తప్పని పరిస్థితి.  అందుకే పాఠశాలకు సులభంగా వెళ్లడానికి వీలుగా ఒక ట్రైసైకిల్ కావాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు పెట్టుకున్న విజ్ఞప్తి చేసి ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. 

6 నెలల వయస్సులోనే జరిగిన ఒక ప్రమాదంలో ఏడేళ్ల రాగిణి తన ఎడమ కాలును కోల్పోయింది. అయినప్పటికీ, చదువుకోవాలనే పట్టుదలతో ప్రతిరోజూ ఒంటికాలితో దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు గెంతుతూ వెళ్తోంది. బల్లియాలోని మనియార్ విద్యా బ్లాక్‌లో ఉన్న దిఘేడా ప్రాథమిక పాఠశాలలో   రాగిణి మొదటి తరగతి చదువుతోంది.

ట్విటర్‌లో Benarasiyaa అనే యూజర్‌ ఆమె పరిస్థితిని వివరిస్తూ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. చదువును కొనసాగించడానికి ఆమెకు కావలసింది కేవలం ఒక ట్రైసైకిల్ మాత్రమే అంటూ జిల్లా కలెక్టర్‌ను  ట్యాగ్‌  చేస్తూ ట్వీట్‌ చేశారు.  ఈ సందర్భంగా  ఒక నిరుపేద చిన్నారికి ప్రాథమిక సదుపాయం అందించేందుకు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు స్థానిక యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నెటిజన్లు కూడా పాఠశాల అధికారులు లేదా స్థానిక యంత్రాంగం ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. ఆ బాలికకు భారీ మద్దతు లభిస్తోంది. 

నెటిజన్ల స్పందనలు
ఆమెకు చికిత్స అవసరం. ట్రైసైకిల్ ఆమెకు శాశ్వత పరిష్కారం కాదు. ఆమె వయసు కేవలం 7 ఏళ్లు మాత్రమే, ఇంకా ఆమె శారీరక ఎదుగుదల మిగిలే ఉందని ఒకరు 5-8 వేల రూపాయలకే ట్రైసైకిల్ వస్తుంది కదా, క్రౌడ్ ఫండింగ్ (ప్రజల నుంచి విరాళాలు) చేసి ఉండవచ్చు లేదా కనీసం DMకి సమాచారం ఇచ్చి ఉండాల్సింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోజు సెలవు పెట్టి చూపించి ఉండాల్సింది కదా   మరొకరు వ్యాఖ్యానించారు.

 

ఇలాంటి వార్తలు చూసినప్పుడు బాధ అనిపిపిస్తుంది. వెనుకబడిన పౌరుల కోసం దేశం  ఎంతైనా చేయాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆమెకు తక్షణమే సహాయం చేస్తుందని ఆశిస్తున్నా అన్నారు. మరొకరు వ్యక్తి కృత్రిమ కాలు (prosthetic limb) అమర్చడంలో సహాయం చేస్తానని ముందుకొచ్చారు. ఈ  ఖర్చును తానే భరిస్తానని  హామీ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి కూడా ఆ వీడియోపై స్పందించి ఆమెకు ట్రైసైకిల్ సమకూర్చినట్టు  తెలిసిందన్నారు.

స్పందించిన యంత్రాంగం
చివరికి, బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ (DM) ఆ చిన్నారికి ట్రైసైకిల్‌ను అందించడం విశేషం. దీంతో ఇకపై ఆ చిన్నారి బడికి వెళ్లేటప్పుడు కుంటుతూ నడవాల్సిన అవసరం ఉండదు. అయితే, ఇది శాశ్వత పరిష్కారం కాదు. ప్రమాదంలో దెబ్బతిన్న ఆ చిన్నారి కాలు సరిగ్గా నయమవ్వాలంటే, ఆమెకు సరైన వైద్య చికిత్స అందడం ఇప్పుడు చాలా అవసరమని వీడియో షేర్‌ చేసినవ్యక్తి ఆనందం వెలిబుచ్చారు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 20 మందికి పైగా ట్రైసైకిల్ ఇస్తామని ముందుకు వచ్చారు. కానీ మొదట జిల్లా యంత్రాంగం నుండి సహాయం కోసం వేచి చూసినట్టు చెప్పారు.

ఆప్‌ సాయం
మరోవైపు  ఈ విషయంలో సోషల్‌మీడియాలో  వైరల్‌ కావడంతో రాగిణికి సహాయం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యకర్తలు ముందుకు వచ్చారు. AAP ప్రతినిధి సర్వేష్ మిశ్రా , బల్లియా జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ యాదవ్ రాగిణి కుటుంబాన్ని సంప్రదించారు.  AAP నాయకుడు సంజయ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, పార్టీ కార్యకర్తలు స్థానిక సభ్యులతో కలిసి ఆ చిన్నారిని కలిసి ఆమెకు వీల్‌చైర్‌ను అందించారు. అలాగే ఆ కుటుంబానికి రూ. 25,000 ఆర్థిక సహాయం కూడా అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement