న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ కత్తిపోట్లు, సంచలన విషయాలు | Bank Of America Vice President New Mom Killed In Times Square Stabbing | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ కత్తిపోట్లు, సంచలన విషయాలు

Sep 2 2026 1:18 PM | Updated on Sep 2 2026 1:52 PM

Bank Of America Vice President New Mom Killed In Times Square Stabbing

న్యూయార్క్‌: న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లో చోటుచేసుకున్న కత్తిపోట్ల ఘటనలో (Times Square Stabbing) సంచలన విషయం వెలుగులోకివచ్చింది. మరణించిన మహిళను 'బ్యాంక్ ఆఫ్ అమెరికా' (BofA) వైస్ ప్రెసిడెంట్‌  ఎరిన్ పియాసెంటి (Erin Piacenti)గా పోలీసులు గుర్తించారు. ఐవీ లీగ్ గ్రాడ్యుయేట్ అయిన ఈమె ఫోర్ధమ్ లా స్కూల్ నుంచి న్యాయ విద్యను పూర్తిచేసింది. ఇటీవల ప్రసూతి సెలవు (Maternity Leave) ముగించుకుని తిరిగి ఉద్యోగంలో చేరిన ఆమె అకాల మరణం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దారుణ ఘటనపై బ్యాంక్ ఆఫ్ అమెరికా,  ఫోర్ధమ్ లా స్కూల్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.

న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సబ్‌ స్టేషన్‌కు సమీపంలోనే 49 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా షాపింగ్‌ బ్యాగ్‌ నుంచి రెండు కత్తులు బయటకు తీసి  ఎటాక్‌ చేసింది.  ఈ దాడిలో ఎరిన్ పియాసెంటి ప్రాణాలు కోల్పోగా, 68 ఏళ్ల మరో వృద్ధుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దాడికి పాల్పడిన మహిళను క్వీన్స్‌కు చెందిన పామెలా సిస్నెరోస్ (49)గా గుర్తించారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఈమె తన షాపింగ్ బ్యాగ్ నుంచి రెండు పెద్ద కత్తులు తీసి ఇద్దరిపై దాడి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధించగా, ఆమె కత్తులతో పోలీసులపైకి దూసుకురావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  వైరల్‌ అయింది.

ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు
మరోవైపు ఈ ఘటనపై  అని న్యూయార్క్‌ మేయర్‌ జొహ్రాన్‌ మమ్దానీవిచారాన్ని ప్రకటించారు. బాధిత కుటుంబాలు వేదనను అర్థం చేసుకోగలమని, వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: సుశాంత్‌ సింగ్‌ మాజీ మేనేజర్‌ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement