టైమ్స్‌ స్క్వేర్‌ వేదికగా చీర ఘనత | Indian sarees displayed at New York Times Square | Sakshi
Sakshi News home page

టైమ్స్‌ స్క్వేర్‌ వేదికగా చీర ఘనత

Aug 26 2026 5:55 AM | Updated on Aug 26 2026 5:55 AM

Indian sarees displayed at New York Times Square

చీర కట్టుకుని ‘శారీ వాకథాన్‌’లో పాల్గొన్న పలువురు భారతీయ మహిళలు

న్యూయార్క్‌లో తళుకులీనిన పలు రకాల చీరలు

న్యూయార్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ నారీమణులు తమ చీరకట్టుతో టైమ్స్‌ స్క్వేర్‌ కూడలివాళ్లను కట్టిపడేశారు. భారతీయతకు నిలువెత్తు నిదర్శనంగా చీరలను ధరించి దేశ సంస్కృతి, చేనేత వారసత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటారు. న్యూయార్క్‌ నగరంలోని దాతృత్వ సంస్థ ఉమా గ్లోబల్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘ప్రపంచాన్ని చుట్టేస్తున్న చీర’మూడో ఎడిషన్‌ కార్యక్రమాన్ని అత్యంత కన్నులపండువగా నిర్వహించారు. భారత్‌లోని భిన్న ప్రాంతాలకు చెందిన మహిళలు పలు రాష్ట్రాలకు, ప్రాంతాలకు వన్నె తెచ్చిన వైవిధ్యభరితమైన చీరలను అందంగా కట్టుకుని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద హొయలుపోతూ వయ్యారంగా నడిచి చీరకట్టుతోనే సొగసు, సోయగం, అందాన్ని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులను ప్రశంసలుగా అందుకున్నారు. 

అస్సామీ మగ్గాల మీద నేసిన చీరలు మొదలు లక్నో చికంకారీ, బెనారస్‌ సిల్‌్క, కంజీవరం, పోచంపల్లి చీరల దాకా పలు ప్రాంతాలకు పేరుప్రఖ్యాతలు తెచి్చన చీరలను కార్యక్రమంలో మహిళామణులు ధరించారు. భారతీయ కళ, సాంప్రదాయం, చేనేత ఘన వారసత్వానికి చీర సజీవ సాక్ష్యం’’అని న్యూయార్క్‌ గవర్నర్‌ కేథీ హోషల్‌ వ్యాఖ్యానించారు. ప్రధాన కూడలిలో చీరలను ప్రదర్శించి గర్వపడేలా సంబరాలు చేశారని ఆమె పొగిడారు. భిన్న రకాల్లో నేసిన చీరలను, విభిన్న డిజైన్లతో ఆకట్టుకునే చీరలను ధరించి త్రివర్ణ పతాకం చేతబూని దేశభక్తి పాటలను పాడారు. 

తర్వాత చక్కటి సంగీతానికి నృత్యంచేస్తూ సంబరాల్లో మునిగారు. ప్రాచీన సిందూ నాగరికత మొదలు నేటి ఆధునిక నాగరికత దాకా ఎంతోమంది డిజైనర్లు ఎన్నో రకాలుగా నేసిన, రూపొందించిన చీర ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వస్త్రధారణలో ఎంతో ఆధునికత వచ్చినా నేటి యువతరం ఇప్పటికీ చీరకు ప్రత్యేక స్థానమిస్తోంది. పెళ్లిళ్లు మొదలు పని ప్రదేశాల దాకా అంతటా చీరను ధరిస్తూ చీర పట్ల తమ మమకారాన్ని చాటుకుంటున్నారు’’అని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో కాన్సుల్‌ ట్రేడ్‌ రాజ్యలక్ష్మి అప్పాసాహెబ్‌ కదమ్‌ వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement