నో ఫుడ్‌, నో మనీ : కట్‌ చేస్తే కంపెనీ సీఈవోగా | Mumbai CEO spent 7 days with no money for food at 18 says everyone should hit rock bottom once | Sakshi
Sakshi News home page

నో ఫుడ్‌, నో మనీ : కట్‌ చేస్తే కంపెనీ సీఈవోగా

Sep 2 2026 3:07 PM | Updated on Sep 2 2026 3:30 PM

Mumbai CEO spent 7 days with no money for food at 18 says everyone should hit rock bottom once

Abhishek Agarwal Success story ముంబైకి చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు అభిషేక్ అగర్వాల్ జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు,  అనుభవించిన కష్టాల గురించి పంచుకున్న వివరాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు అనుభవించి తీరాలనీ, కడుపు మాడే కష్టాల్లోంచే ఎదగాలనే కసి పుట్టుకొస్తుందని, జీవితంలో అట్టడుగు స్థాయికి పడిపోయినప్పుడు మాత్రమే ఒక రకమైన ధైర్యం వస్తుందన్న ఆయన వ్యాఖ్యలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి.

అభిషేక్ అగర్వాల్  లింక్డ్‌ఇన్ (LinkedIn) పోస్ట్‌లో షేర్‌  చేసిన వివరాల ప్రకారం  ఆయన 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వరుసగా 7 రోజుల పాటు కనీసం తినడానికి తిండికి డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో కేవలం బ్రెడ్ తింటూ, నీళ్లు తాగుతూ పొట్ట నింపుకున్న వైనాన్నిగురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిని ఎదుర్కోవాల్ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ డబ్బుల్లేకపోవడం అంటే సరదాగా టూర్లకు వెళ్లకపోవడం లేదా షాపింగ్  చేయకపోవడం కాదనీ  కనీసతినడానికి కూడా డబ్బులు లేని పేదరికమని స్పష్టం చేశారు.

కాలే కడుపు నేర్పిన పాఠం
ఆ 7 రోజుల ఆకలి కంటే, ఆ సమయంలో కలిగిన 'నిస్సహాయత' తన మనసుపై తీవ్రమైన ముద్ర వేసిందని చెప్పారు. ఒకప్పుడు అత్యంత కష్టకాలంగా భావించిన ఆ రోజులు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితం పట్ల తన దృక్పథాన్ని తీర్చిదిద్దిన అనుభవాలలో ఒకటిగా మారాయన్నారు. అయితే జీవితంలో అత్యంత దిగువ స్థాయికి పడిపోయినా, తాను దానిని తట్టుకుని బ్రతకగలననే నమ్మకం, ధైర్యం తనకు  ఆ సందర్భంలోనే పుట్టిందన్నారు.

ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారు

అంతేకాదు ఆ అనుభవం ఇచ్చిన ధైర్యమే ఆ తర్వాత వ్యాపారంలో ఎదురైన నష్టాలు, రిస్కులు, ఓటములను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసిందని తెలిపారు. అయితే, కష్టాల నుండి స్థైర్యాన్ని నేర్చుకోవడానికి, పేదరికాన్ని ఆదర్శంగా భావించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించారు.పేదరికాన్ని లేదా బాధలను గొప్పగా చూపించడం తన ఉద్దేశం కాదని, కానీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లను తట్టుకునే శక్తి మనకు ఉందనే విషయం అట్టడుగుకి పడిపోయినప్పుడే తెలుస్తుందని వివరించారు.

నెటిజన్ల స్పందన
అగర్వాల్ పోస్ట్‌పై అనేకమంది నెటిజన్లు స్పందించారు. గొప్ప పోస్ట్. కొన్నిసార్లు అత్యంత కఠినమైన క్షణాలు, విజయం ఎప్పటికీ నేర్పలేని ఒక విషయాన్ని మనకు నేర్పిస్తాయి: మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ తట్టుకోగలమని ఒకరు,  తమ జీవితాల్లో కూడా ఇలాంటి కష్ట సమయాలను ఎదుర్కొన్నామని, ఆ రోజులు ఇచ్చిన ధైర్యమే తమను ఇప్పుడు ఏ సమస్యనైనా ఎదుర్కొనేలా చేస్తోందని  మరొకరు కామెంట్స్‌ చేశారు.'దివాలా' అనే పదానికి నిర్వచనాన్ని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు ఫన్నీగా స్పందించారు.

ఇదీ చదవండి: సుశాంత్‌ సింగ్‌ మాజీ మేనేజర్‌ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement