లేస్ నుంచి మ్యాగీ వరకు.. అసలేం జరుగుతుందంటే? | Lays Kurkure Maggi Expiry Dates Altered In Multi Crore Racket In Mumbai | Sakshi
Sakshi News home page

లేస్ నుంచి మ్యాగీ వరకు.. అసలేం జరుగుతుందంటే?

Sep 1 2026 7:58 AM | Updated on Sep 1 2026 8:24 AM

Lays Kurkure Maggi Expiry Dates Altered In Multi Crore Racket In Mumbai

మీరు షాపుల్లో కొనుగోలు లేస్, కుర్‌కురే, మ్యాగీ ప్యాకెట్‌పై తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ నిజమేనని నమ్ముతున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించాల్సిందే! నవీ ముంబైలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్యాకెట్లపై ఉన్న అసలు తేదీలను చెరిపేసి.. కొత్త తేదీలతో స్టిక్కర్లు అంటించి, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం కలకలం రేపుతోంది. అధికారుల దాడుల్లో ఏకంగా రూ.75 లక్షలకు పైగా విలువైన సరుకు పట్టుబడింది.

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), నవీ ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో లేస్, కురుకురే, మ్యాగీ, నార్, రసోయ్, హెల్‌మాన్స్, థమ్స్ అప్, లిమ్కా వంటి శీతల పానీయాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్ట్ 24 నుంచి 29 మధ్య టర్బే పారిశ్రామిక ప్రాంతాలలో సాధనా ఎంటర్‌ప్రైజెస్ ప్రాంగణంలో ఈ దాడులు నిర్వహించారు.

ఆహార ప్యాకేజింగ్‌పై ముద్రించిన తేదీలను తొలగించి వాటిపై వేరే తేదీలను ముద్రిస్తున్నారు. అసలు తయారీ సమాచారాన్ని చెరిపివేయడానికి ఇంక్‌జెట్ ప్రింటర్లు, థిన్నర్లు, ప్రత్యేకంగా తయారు చేసిన స్టిక్కర్లను ఉపయోగిస్తున్నట్లు ఎఫ్‌డీఐ అధికారులు గుర్తించారు. పదార్థాలు, పోషకాహార విలువలకు సంబంధించిన వివరాలున్న లేబుళ్లను తొలగించి.. వాటి స్థానంలో కొత్త స్టిక్కర్లను అతికించినట్లు తేలింది. ముంబైతో పాటు ఢిల్లీ, నోయిడాకు చెందిన ఎగుమతి-దిగుమతి కంపెనీలకు కూడా ఈ మోసంలో ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement