నెవ్వర్‌ బిఫోర్‌ : లగ్జరీ ఈవీలపై శ్రీమంతుల మోజు | Luxury EV Boom In India, Why Rich Car Buyers Are Choosing Electric Over Petrol And Diesel, Check Out More Details | Sakshi
Sakshi News home page

నెవ్వర్‌ బిఫోర్‌ : లగ్జరీ ఈవీలపై శ్రీమంతుల మోజు

Aug 31 2026 4:28 PM | Updated on Aug 31 2026 4:50 PM

Indias rich are embracing electric cars like never before check deets

సాక్షి, ముంబై:  దేశంలో లగ్జరీ  ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలు జోరుగా సాగుతోంది. ముఖ్యంగా జర్మనీకి చెందిన కార్ల దిగ్గజం BMW  టాప్‌లో నిలిచింది.  భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు BMW కార్లలో ఒకటి ఇప్పుడు ఎలక్ట్రిక్ కారే కాగా, రూ. 1.4కోట్లకు పైగా ధర పలికే మెర్సిడెస్ BEVలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ధనవంతులు/ప్రీమియంకార్ల కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపడానికి కారణాలేంటి?  

లగ్జరీ విభాగంలో ఈవీల జోరు
2026 మొదటి ఆరు నెలల్లో దేశంలో అమ్ముడైన ప్రతి నాలుగు BMW కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ వాహనమే (మొత్తం 2,359 యూనిట్లు). మొత్తం మార్కెట్‌తో పోలిస్తే సాధారణ ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో EVల వాటా 8-9శాతం మాత్రమే ఉండగా, BMW లో ఇది 3 రెట్లు (సుమారు 25-26శాతం) ఎక్కువగా ఉంది.

మర్సిడీజ్ బెంజ్ (Mercedes-Benz): రూ. 1.4 కోట్ల కంటే ఎక్కువ ధరపలికే 'టాప్-ఎండ్' విభాగంలో సగటున ప్రతి 3 గంటలకు ఒక ఎలక్ట్రిక్ కారు అమ్ముడైంది. అలాగే రూ. 57 లక్షల ప్రారంభ ధర కలిగిన 'CLA BEV' మోడల్ 2026 సంవత్సరానికి సంబంధించిన స్టాక్ అంతా ఇప్పటికే అమ్ముడైపోయింది. పెట్రోల్/డీజిల్ కార్ల విక్రయాల వృద్ధి నెమ్మదించినప్పటికీ, EVల కారణంగా మర్సిడీజ్ బెంజ్ మొత్తం వృద్ధి 9శాతానికి, BMW వృద్ధి 17శాతానికి పెరిగింది.

ఈవీలపై శ్రీమంతుల  ఎందుకింత మోజు
సాధారణ వాహనదారులను ఇబ్బంది పెట్టే సమస్యలు ధనవంతులకు అడ్డంకిగా మారకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నాయి మార్కెట్‌ వర్గాలు. ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సౌకర్యం, బహుళ కార్ల గ్యారేజీలు, అనుకూలమైన పన్నుల విధానం , మోడళ్లలో పెరుగుతున్న ఎంపికలు వంటివి సంపన్నులలో EVల వినియోగాన్ని వేగవంతం చేస్తున్నాయంటున్నారు  ఆటోమొబైల్‌ రంగ నిపుణులు.

సొంత పార్కింగ్ స్థలాలు ఉండటంతో వీరు ఇంట్లోనే రాత్రంతా ఉచితంగా/సులభంగా ఛార్జింగ్ చేసుకునే పాయింట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. బయటి ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. 

సాధారణంగా లగ్జరీ పెట్రోల్/డీజిల్ కార్లపై 28శాతం GST + సెజ్ (కలిపి దాదాపు 48శాతం పన్ను) పడుతుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలపై కేవలం 5శాతం GST మాత్రమే ఉంటుంది. దీనివల్ల పెట్రోల్ , EV లగ్జరీ కార్ల మధ్య ధర తేడా చాలా వరకు తగ్గుతుంది.

ఎలక్ట్రిక్ మోటార్లు తక్షణ వేగాన్ని (instant torque) ఇస్తాయి, ఇంజిన్ శబ్దం లేకపోవడం వల్ల లగ్జరీ కార్లలో కోరుకునే నిశ్శబ్దకరమైన (quietness) అనుభూతి లభిస్తుంది. 2025 ఆర్థిక సంవత్సం నుంచే Porsche, Volvo, Rolls-Royce, Ferrari, Lexus వంటి లగ్జరీ సంస్థలు రూ. 5 కోట్ల వరకు ఖరీదు చేసే భారతదేశంలో 13 కొత్త EV మోడళ్లనుప్రారంభించాయి. చక్కటి డ్రైవింగ్ అనుభవం, అత్యాధునిక టెక్నాలజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా లగ్జరీ ఈవీలు కోటీశ్వరులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయాయనడంలో సందేహం లేదు.

ఇదీ చదవండి: మైనస్‌ 50 డిగ్రీల చలి.. లక్షల మంది జీవించే నగరం ఇదే!

టెస్లా వెనుకంజ
ఎలక్ట్రిక్ రంగంలో ప్రసిద్ధి చెందినప్పటికీ, టెస్లా  తొలి ఏడాదిలో (జూన్ 2026 నాటికి) భారతదేశంలో కేవలం 450 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. టెస్లా వద్ద కేవలం 'Model Y' మోడల్ మాత్రమే ఉండటం, భారతదేశంలో ఇతర లగ్జరీ బ్రాండ్ల లాగా విస్తృతమైన డీలర్/సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవడం దీనికి కారణం.

ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్‌ క్రష్‌’


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement