యాకుట్సిక్, సఖా రిపబ్లిక్ క్షణాల్లో వేడి నీళ్లను మంచులా మార్చేసే చలి. ప్రతీ క్షణం జీవితాన్ని ఒక అడ్వెంచర్‌గా మార్చే వాతావరణం. ఈ నగరంలో చలికాలంలో టెంపరేచర్ మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ ప్రదేశమే రష్యాలోని సఖా రిపబ్లిక్ రాజధాని యాకుట్సిక్.
సైబీరియాలోని ఈశాన్య ప్రాంతంలో లెనా నది తీరంలో ఉన్న యాకుట్సిక్‌ను ప్రపంచంలోనే అత్యంత కోల్డోస్ట్ సిటీల్లో ఒకటిగా చెబుతారు. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దాదాపు ఏడు నెలల పాటు ఉండే చలికాలంలో లైఫ్ ప్రతీ రోజు ఒక ఛాలెంజ్‌లా ఉంటుంది.
సిమెంట్ పిల్లర్స్‌పై నిలబడే ఇల్లు
యాకుట్సిక్ ఉన్న సఖాలో ప్రాంతంలో అధిక భాగం పర్మాఫ్రాస్ట్ నేల ఉంటుంది. అంటే భూమి లోపలి పొరలు వందల మీటర్ల లోతు వరకు శాశ్వతంగా గడ్డకట్టిన స్థితిలో ఉంటాయి. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అంటే మంచు గడ్డపై నిలబడే ప్రయత్నం చేయడం లాంటిదే. అందుకే ఇంటి నిర్మాణం కోసం డిఫరెంట్ టెక్నాలజీని వినియోగిస్తారు. ఇంటిని బలమైన పైల్స్‌పై అంటే పొడుగాటి పిల్లర్స్‌పై నిర్మిస్తారు. ఇంటి నుంచి బయటికి వచ్చే వేడి వల్ల అక్కడి గడ్డకట్టిన నేల కరగకుండా గ్యాప్‌తో నిర్మిస్తారు.
నీటి పైపులు కూడా బయటే
మన ఇంటి పైపులు సాధారణంగా అయితే భూమిలోపల ఉంటాయి కదా.. కానీ ఇక్కడ మాత్రం భూమిపైనే ఈ పైపులను అంటే నీరు, హీటింగ్, గ్యాస్‌లాంటి ఇంధన సరఫరా వ్యవస్థలకు సంబంధించిన పైపులను భూమిపైనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ పైపులు భూమిలోపల ఉంటే వాటి మెయింటెనెన్స్ చాలా కష్టం. బయటి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వీటికి స్పెషల్ ఇన్సులేషన్ ఏర్పాటు చేస్తారు.
ఇంతటి అత్యంత చల్లని వాతావరణంలోనూ యాకుట్సిక్‌లో లక్షలాది మంది ప్రజలు సాధారణంగా జీవిస్తారు. స్కూల్స్, ఆఫీసులు, షాపులు, ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ కూడా ఇక్కడి వాతావరణాన్ని బట్టి నడుస్తాయి. కోల్డెస్ట్ ప్రదేశంగా పాపులర్ అయిన యాకుట్సిక్‌లో డైమండ్స్ లాంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. మంచుతో కవర్ అయిన ఈ నేలలో దాగి ఉన్న ఖనిజ సంపదే ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
హైదరాబాద్ నుంచి యాకుట్సిక్ ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి యాకుట్సిక్‌కు వెళ్లేందుకు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. హైదరాబాద్ నుంచి ముందు మాస్కో వెళ్లి, అక్కడి నుంచి యాకుట్సిక్‌కు వెళ్లవచ్చు. మొత్తం ప్రయాణానికి సుమారు 15 నుంచి 20 గంటల టైమ్ పట్టే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ?


