సాక్షి, చెన్నై: చెన్నైలోని కోవిలంబక్కమ్‌లో మరో వరకట్న మరణం విషాదాన్ని నింపింది. ఉన్నత విద్యావంతురాలు, ఉద్యోగం, పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ముట్టజెప్పినప్పటికీ అత్తింటివారి ఆశ తీరలేదు. వేధింపులను తట్టుకోలేక పెళ్లైన రెండేళ్లకే ఏడాదిన్నర పసిగుడ్డును అనాథను చేసి, ఆమె ఉసురు తీసుకుంది.
మృతురాల్ని చెన్నైలోని కోవిలంబాక్కంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భువనేశ్వరి (27)గా గుర్తించారు. M.Sc. B.Ed. పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఒక సంవత్సరం వయసున్న కుమారుడు ఉన్నాడు.
భారీగా కట్నం, అయినా తీరని దాహం
భువనేశ్వరికి 2024 సెప్టెంబర్‌లో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల విలువైన కారు, 50 సవర్ల బంగారం ఇచ్చారు. అదనంగా వరుడికి మరో 20 సవర్ల బంగారం సమర్పించారు. పెళ్లయిన రెండేళ్లలోపే అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు భువనేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఇటీవల కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు బాబుకు బంగారు గొలుసు కానుకగా ఇచ్చారు. ఈ విషయంలో దంపతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.
ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
పెళ్లి అయింది మొదలు భర్త , అత్తమామలు నిరంతర కట్న వేధించేవారనీ, వాటిని భరించలేక తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహమైన ఏడేళ్లలోపు అనుమానాస్పద మృతి కావడంతో వరకట్న మరణంగా కేసు నమోదు చేశారు. దీనిపై RDO (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్) విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి: నెవ్వర్ బిఫోర్ : లగ్జరీ ఈవీలపై శ్రీమంతుల మోజు


