చెన్నై రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు భద్రత కుదించారు. ఇప్పటివరకు కొనసాగుతున్న Z+ భద్రతను Z కేటగిరీకి తగ్గిస్తూ విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్టాలిన్‌కు భద్రత కల్పించే సిబ్బంది సంఖ్య కూడా 58 నుంచి 33కి తగ్గనుంది. ఇంటెలిజెన్స్ నివేదికలు, ముప్పు అంచనాల ఆధారంగా భద్రతా సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే మాజీ సీఎం భద్రత తగ్గింపు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
కాగా, భద్రతా విభాగం నిర్వహించిన క్రమబద్ధమైన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. తమిళనాడులో వీఐపీలు, వీవీఐపీలకు కల్పించే భద్రతను సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, ముప్పు తీవ్రత, సంబంధిత వ్యక్తి ప్రజల్లో తిరిగే పరిస్థితి, ప్రయాణాల తీరు, భద్రత అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భద్రతా కేటగిరీని కొనసాగించాలా? పెంచాలా? తగ్గించాలా? అన్నది నిర్ణయిస్తారు.
58 నుంచి 33కు భద్రతా సిబ్బంది..
Z+ భద్రతలో స్టాలిన్‌కు రోజువారీ రొటేషన్ పద్ధతిలో సుమారు 58 మంది సిబ్బంది భద్రత కల్పిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 33కు తగ్గనున్నట్లు సమాచారం. అయితే కొన్ని నివేదికల్లో కొత్త Z కేటగిరీ కింద విధుల్లో ఉండే సిబ్బంది సంఖ్యను వేరుగా పేర్కొన్నారు. భద్రత పూర్తిగా తొలగించడం మాత్రం జరగలేదు. స్టాలిన్ కాన్వాయ్‌లో ముందు, మధ్య, వెనుక భాగాల్లో భద్రతా బృందాలను కొనసాగించనున్నారు. పైలట్, ఎస్కార్ట్, బ్యాకప్, క్లోజ్ ప్రొటెక్షన్ వాహనాలతో ఆయనకు రక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
🚨 SECURITY COVER FOR M.K. STALIN REDUCED
DMK leader M.K. Stalin’s Z-category security has been withdrawn. He will now receive escort security as a former Chief Minister, with four police personnel led by an SI assigned to his security.#MKStalin #DMK #Stalin #SecurityCover… pic.twitter.com/b44TG81S9p— Chennai Memes (@memeschennai) August 30, 2026
సమీక్ష తర్వాతే నిర్ణయం..
స్టాలిన్ భద్రతపై రాష్ట్ర సచివాలయంలోని కోర్ సెల్ సెక్యూరిటీ వింగ్ సమీక్ష నిర్వహించింది. ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, హోంశాఖ కార్యదర్శి కె. మణివాసన్, డీజీపీ మహేశ్ కుమార్ అగర్వాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్, స్టాలిన్ ప్రస్తుత భద్రతా అవసరాలను పరిశీలించిన అనంతరం భద్రతా కేటగిరీని తగ్గించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల ప్రకారం ఇది భద్రతను పూర్తిగా ఉపసంహరించుకోవడం కాదని.. ముప్పు అంచనాకు అనుగుణంగా భద్రతా బందోబస్తును పునర్వ్యవస్థీకరించడమేనని స్పష్టం చేశారు. తాజా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అవసరమైతే భవిష్యత్తులో భద్రతను మళ్లీ పెంచే అవకాశం కూడా ఉంటుంది.
చదవండి: ‘థమన్‌కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
రాజకీయంగా ఆసక్తికరంగా మారిన నిర్ణయం
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో స్టాలిన్ భద్రత కుదించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే భద్రత తగ్గింపునకు ఎన్నికల ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా ప్రొఫెషనల్ థ్రెట్ అసెస్‌మెంట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, స్టాలిన్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ డీఎంకే అధ్యక్షుడిగా తమిళనాడులో కీలక రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. అందువల్ల ఆయన భద్రతా కేటగిరీ మార్పు రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.


