తొలి సెల్ఫీ..! కిటికి నుంచి మొదలైన ప్రయోగమే ఇది.. | In 1839 Robert Cornelius took the world's first selfie | Sakshi
Sakshi News home page

తొలి సెల్ఫీ..! కిటికి నుంచి మొదలైన ప్రయోగమే ఇది..

Aug 27 2026 5:13 PM | Updated on Aug 27 2026 5:19 PM

In 1839 Robert Cornelius took the world's first selfie

కాలం తాలూకు ఓ ముక్కను మన చేతిలో వదిలిపోతే ఎలా ఉంటుంది? మన కంటే వందల రెట్లు కనిపించే ప్రపంచం మన అరచేతిలో చాటుగా వచ్చి చేరిపోతే ఎలా ఉంటుంది? ఫొటో ఇచ్చే కిక్కే అదే కదా..? ఫొటో తీసే ముందు వచ్చే క్లిక్‌మనిపించే శబ్దానికి అక్షరాలా రెండు శతాబ్దాలు నిండాయంటే నమ్మశక్యం కాదు.. అయినా ఇది నిజం..

ఫ్రెంచ్‌ ఆవిష్కర్త జోసెఫ్‌ నిసెఫోర్‌ నీప్స్‌ 1820లలో కాంతిని ఉపయోగించి ఒక చిత్రాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాల ఫలితమే వ్యూ ఫ్రమ్‌ ద విండో అట్‌ లి గ్రాస్‌. 1826లో అతని ప్రయోగాల ఫలితంగా తొలిఫొటోను తీయగలిగాడు. ఆ ఫొటోలో నీప్స్‌ ఇంటి కిటికీ బయట ఉన్న భవనాలు, పైకప్పులు కనిపిస్తాయి. 

విశేషమేమిటంటే ఇప్పుడు ఫొటో తీయడానికి కెమెరాలో బటన్‌ నొక్కితే క్షణంలో ఫొటో తీయొచ్చు.. కాని ఆ రోజుల్లో నీప్స్‌ అదే పని చేయడానికి సూర్యకాంతి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇంటి కిటికీ నుంచి మొదలైన ఆ చిన్నప్రయోగమే నేడు డిజిటల్‌ కెమెరాలు, మొబైల్‌ కెమెరాల నుంచి ఐమాక్స్‌ కెమెరాల వరకు అభివృద్ధి చెందింది. 

ఇదే ఫస్ట్‌ సెల్ఫీ
ఫొటోగ్రఫీ మీద నీప్స్‌ తర్వాత చాలామంది పరిశోధనలు చేశారు. 1839లో అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన రాబర్ట్‌ కార్నీలియస్‌ తన కుటుంబానికి చెందిన గ్యాస్‌ లైటింగ్‌ వ్యాపార ప్రాంగణంలో కెమెరాను ఏర్పాటు చేశాడు. అప్పటి కెమెరాలు నేటి ఫోన్‌ కెమెరాల్లా ఉండేవి కావు. ఫొటో తీయడానికి లెన్స్‌ క్యాప్‌ తొలగించి, వెంటనే కెమెరా ముందు కూర్చోవాలి. తిరిగి వెళ్లి లెన్స్‌ను మూసేయాలి. అలా కార్నీలియస్‌ తీసుకున్న స్వీయచిత్రాన్నే ప్రపంచంలోనే తొలి సెల్ఫీగా పరిగణిస్తున్నారు.  

(చదవండి: భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేయలేకపోతున్నా! అమెరికా వ్యక్తి ఆవేదన..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement