హాబీతో కేన్సర్‌ని జయించింది..! వైద్యానికే అందని మిరాకిల్‌.. | 67 year old woman diagnosed with cancer spends life savings on Antarctica trip | Sakshi
Sakshi News home page

హాబీతో కేన్సర్‌ని జయించింది..! వైద్యానికే అందని మిరాకిల్‌..

Oct 11 2026 5:37 PM | Updated on Oct 11 2026 5:43 PM

67 year old woman diagnosed with cancer spends life savings on Antarctica trip

కేన్సర్‌ మహమ్మారి ఎవ్వరినైనా కుంగదీసి..కన్నీళ్ల కడలిలోకి నెట్టేస్తుంది. దాన్నుంచి ధైర్యంగా నిలబడటానికి ఎంతో గట్స్‌ ఉండాలి. అయితే అది కూడా అందర్నీ భయపెట్టలేదు అనేదానికి ఈ మహిళే ఉదాహరణ. అలాంటి ధీరురాలే ఈ మహిళ. కనీసం ఈమె చికిత్స తీసుకోకుండానే ఆ వ్యాధిని జయించింది. అది కూడా తనకు నచ్చిన అభిరుచితో. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోకండి. తొందరగా ఆమె కథేంటో చదివేయండి మరి..!.

ఆ మహిళే చైనాకు చెందిన 67 ఏళ్ల వాంగ్‌ యింగ్‌. ఆమె యునాన్స్‌ ప్రావిన్స్‌ రాజధాని కున్మింగ్‌లో ఒక పాఠశాల నిర్వాహకురాలిగా పనిచేస్తుండేది. ఆ సమయంలోనే తనకు థైరాయిడ్‌ కేన్సర్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. పదవీ విరమణ సిద్దమవుతున్న సమయంలోనే ఆపరేషన్‌ చేయించుకోవడమే మేలు అని వైద్యులు సూచించారు. ఎవ్వరైనా కేన్సర్‌ వచ్చింది అని తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. జీవిత గమనమే మారిపోతుంది. 

కానీ ఈ ఉక్కు మహిళ వైద్యులు ఎంతలా భయపెట్టేలా తగు జాగ్రత్తలు చెప్పినా.. సింపుల్‌గా ఆపరేషన్‌ చేయించుకోను అని చాలా తేలిగ్గా చెప్పేసేంది. కనీసం తనలో బాధ, వేదన అనే వాటికి చోటు లేదు అన్నట్లుగా కొట్టిపారేసిందామె. ఎలాగో చనిపోతామని తెలిసింది కాబట్టి మిగిలిన ఈ విలువైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. కొద్ది సమయాన్ని కూడా ఆస్పత్రులు, చికిత్సలతో వృధా చేసుకోకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయిపోయింది. 

దాంతో ఏం చేయాలో ప్లాన్‌ వేసుకుని మరి అంటార్కిటికా టూర్‌కి వెళ్లాలని డిసైడ్‌ అయ్యింది. అందుకు తన వద్ద డబ్బు ఎంత మాత్రం సరిపోదు. అయినా వెళ్లాలనుకుంది కాబట్టి వెళ్లిపోయింది. వాంగ్‌ అంచనా వేసినట్లుగానే పెద్ద మొత్తంలోనే ఆ టూర్‌కి ఖర్చు అయ్యింది. సుమారు రూ. 21 లక్షలు పైనే అయ్యింది. అందులో కొంత డబ్బు తల్లి సాయం చేయగా..ఆమె విజయవంతంగా తన యాత్ర పూర్తి చేసింది. 

ఆ యాత్రలో తనకెంతో ఇష్టమైన ఫోటోగ్రఫిని ఆస్వాదించింది. అక్కడుండే అందమైన పెంగ్విన్‌లను చిత్రిస్తూ..సుమారు 1200పైదాక ఇతర పక్షి జాతులను ఫోటో తీస్తూ తన చిరకాల కోరికను సాకారం చేసుకుంది. అక్కడ ఆమె పెంగ్విన్‌ తన పిల్లలకు పాలు పట్టడం తీయాలని అనుకుందట, అందుకోసమే మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, బలమైన గాలులు, భారీ హిమపాతాన్ని కూడా లెక్కచేయకుండా ఆ అందమైన దృశ్యాలను కెమెరాలో బంధించినట్లు పేర్కొంది. కష్టకాలం ఎదురవ్వడంతో చేసిన విహారయాత్ర.. తన చిరకాల కోరిక సాకరాం చేయడమే గాక..ఆమెకు ఓ ఊహించని సర్పైస్‌ కూడా ఇచ్చింది. 

అంటార్కిటికా నుంచి తిరిగి రాగానే ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోగా..ఓ పెద్ద బాంబే పేలింది. నెలరోజుల క్రితం నాటికి ఇప్పటికీ తన కణితిలో అసాధారణ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. రిపోర్ట్‌లో తనకు కేన్సర్‌ పూర్తిగా క్యూర్‌ అయ్యిందని, సర్జరీ చేయించుకోనవసరం లేదని వైద్యలు నిర్థారించి చెప్పడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైంది వాంగ్‌. అయితే వైద్యులు అలా అని నిర్లక్ష్యం వహించొద్దని, శరీరంలో వచ్చే మార్పులని గమనిస్తూ ఉండాలని హెచ్చరించారామెకు. ఇది కాస్తా ఆమెకు తన ఆసక్తులను తిరిగి కొనసాగించేలా స్ఫూర్తిని కలిగించింది. 

తన అంటార్కిటికా యాత్ర ద్వారా ఆస్వాదించిన బర్డ్‌ ఫోటోగ్రఫీ హాబీని వదులుకోవాలనుకోలేదామె. అంతేగాదు అందుకోసం సమయం, డబ్బుని కేటాయించడం నేర్చుకుంది. అంతేగాదు 30కి పైగా దేశాలను సందర్శించి తన పెన్షన్‌ మొత్తాన్ని అధునాత ఫోటోగ్రఫీ పరికరాలపైన ఖర్చే చేసిందామె. అంతేకాదండోయ్‌ వచ్చే ఏడాది అమెరికా, పెరూ, ఆఫ్రికన్‌ దేశాలను కూడా సందర్శించాలని యోచిస్తోందట. పైగా ఇలా అనేక ప్రదేశాలకు చుట్టొచ్చిన తర్వాతే జీవితంలో మార్పులను అంగీకరించడం నేర్చుకున్నా అని అంటోంది. తాను ఇదివరకటిలా కొన్ని విషయాల గురించి పెద్దగా ఆందోళన, హైరానా పడిపోవడం లేదని సంతోషంగా చెబుతోంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇదీ చదవండి: 'పర్ఫెక్ట్ డాడీ'! సూర్య పేరెంటింగ్‌ శైలిపై జ్యోతిక ప్రశంసల జల్లు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement