సాక్షి,చెన్నై: మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు తమిళనాడు మంత్రి కీర్తన గట్టిగా బదులిచ్చారు. కేవలం అంకెల్లో కనిపించే పెట్టుబడుల కంటే, స్థానికులకు ఉపాధి కల్పించే నాణ్యమైన పెట్టుబడులకే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధిపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు మంత్రి కీర్తన స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘ఉద్యోగాలు లేని ఆర్థిక వృద్ధిని మేం వెంటాడటం లేదు. కేవలం పెట్టుబడుల సంఖ్య కంటే వాటి నాణ్యతకే మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. యువతకు ఉపాధి కల్పించని వృద్ధి మాకు అవసరం లేదు’అని ఆమె పేర్కొన్నారు.
రెండు పొరుగు రాష్ట్రాల మంత్రుల మధ్య పెట్టుబడులు, ఉపాధి కల్పన అంశాలపై సాగిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


