పురుషుల చూపులపై 80 శాతం మహిళల ఫిర్యాదు! | Nearly 9 in 10 women girls feel unsafe walking to metro bus stops in Delhi | Sakshi
Sakshi News home page

పురుషుల చూపులపై 80 శాతం మహిళల ఫిర్యాదు!

Nov 25 2026 1:47 PM | Updated on Nov 25 2026 1:47 PM

Nearly 9 in 10 women girls feel unsafe walking to metro bus stops in Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, బాలికల భద్రతపై సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మెట్రో స్టేషన్ లేదా బస్‌స్టాప్‌కు నడిచి వెళ్లేందుకే దాదాపు 10 మందిలో 9 మంది మహిళలు భయపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మహిళల హక్కులు, లింగ సమానత్వం కోసం పనిచేస్తున్న సెంటర్ ఫర్ ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజన్ ఈ నివేదికను రూపొందించింది.

1,588 మంది మహిళలు, బాలికల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. 87.5 శాతం మంది సమీప మెట్రో స్టేషన్ లేదా బస్‌స్టాప్‌కు వెళ్లే మార్గంలో అభద్రతకు గురవుతున్నారు. 88.9 శాతం మంది చీకటి పడిన తర్వాత సమీపంలోని పార్కుల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. మూడు వంతుల మందికి పైగా ఫుట్‌పాత్‌లపై సరైన లైటింగ్ లేదని తెలిపారు. 60 శాతం మంది ఫుట్‌పాత్‌లు దెబ్బతిన్నాయని లేదా అసలు లేవని చెప్పారు.

దాదాపు 80 శాతం మంది పురుషుల చూపులు, అసభ్య వ్యాఖ్యలు, వెంబడించడం వంటి ప్రవర్తన కారణంగా రోజువారీ ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. మరోవైపు 80.5 శాతం మందికి తమ సమస్యలను పరిష్కరించాల్సిన పౌర అధికార సంస్థ ఏదో తెలియదని అధ్యయనం పేర్కొంది.

ఢిల్లీలో మహిళలపై నేరాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. గణాంకాల ప్రకారం.. 2024లో నగరంలో మహిళలపై 13,396 నేరాలు నమోదయ్యాయి. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఇదే అత్యధికం. సెప్టెంబర్‌లో ఆస్తా కుంజ్ పార్కులో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఢిల్లీలో మహిళల భద్రత, ప్రజా ప్రదేశాల పరిస్థితులపై రూపొందించిన ఈ నివేదికను బుధవారం విడుదల చేశారు. మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు, అధికారుల బాధ్యతలను మెరుగుపరచాలని సంస్థ సూచించింది. 

ఇదీ చదవండి: ఆక్స్‌ఫర్డ్ ఆహ్వానం: హైకోర్టును ఆశ్రయించిన సౌరవ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement