పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి వీరంగం : 9 మంది పోలీసులకు కత్తిపోట్లు | Who called me Delhi man enters Jama Masjid police station stabs 9 cops in spree | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌లో వ్యక్తి వీరంగం : 9 మంది పోలీసులకు కత్తిపోట్లు

Nov 24 2026 12:38 PM | Updated on Nov 24 2026 12:38 PM

Who called me Delhi man enters Jama Masjid police station stabs 9 cops in spree

ఢిల్లీలోని జామా మసీదు పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ సెషన్ హింసాత్మక కత్తిపోట్లకు దారితీసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ వివాదంపై కౌన్సెలింగ్ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిచిన ఒక వ్యక్తి కత్తితో ఐదుగురు పోలీసులపై దాడి చేశాడు.ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో అతన్ని పట్టుకోవడానికి వెళ్లిన బృందంపై మరోసారి దాడి చేసి నలుగురు పోలీసులను గాయపరిచాడు. ఈ రెండు దాడుల్లో మొత్తం తొమ్మిది మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది గాయపడ్డారు.


సెంట్రల్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం జామా మసీదు ప్రాంతంలోని కాలా మహల్‌కు చెందిన 30 ఏళ్ల నబీల్‌ తమను వేధిస్తూ, దాడి చేస్తున్నాడని అతని తల్లి , సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కౌన్సెలింగ్ కోసం  ఎస్‌ఐ అజయ్ అతన్ని స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌కు వచ్చిన నబీల్, కిస్నే బులాయా ముఝే ?" (నన్ను ఎవరు పిలిచారు?) అంటూ రుబాబు చేశాడు.  ఎస్ఐ అజయ్ మాట్లాడుతుండగానే నబీల్ కత్తితో అతనిపై దాడి చేశాడని, దీంతో ఎస్ఐ ముఖం, మెడపై గాయాలయ్యాయి. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఇతర అధికారులపై కూడా  నబీల్ దాడికి తెగబడ్డాడు. ఈ దాడి అంతా స్టేషన్ రిసెప్షన్ ప్రాంతంలోనే జరిగింది. ఈ ఘటనలో సబ్-ఇన్‌స్పెక్టర్లు అజయ్, అరవింద్, హెడ్ కానిస్టేబుల్ హరేందర్ తీవ్రంగా గాయపడగా, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ బల్జీత్‌లకు కూడా గాయాల య్యాయి. వీరందరినీ చికిత్స నిమిత్తం గంగారామ్ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి : 24 ఏళ్ల సర్వీసు, ఒక్క ఈమెయిల్‌తో..ఉద్యోగినికి ఊహించని షాక్‌

స్కూటర్ లాక్కొని పరారీ.. మళ్లీ దాడి:
దాడి అనంతరం నబీల్ స్టేషన్ బయటకు పరుగెత్తి, అటుగా వెళ్తున్న ఒకరి వద్ద నుంచి స్కూటర్‌ను లాక్కొని పారిపోయాడు. యాంటీ-ఆటో థెఫ్ట్ స్క్వాడ్, సెంట్రల్ డిస్ట్రిక్ట్ స్పెషల్ స్టాఫ్ సంయుక్త బృందం అతని ఆచూకీని చాందినీ మహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్లీ కబర్ వద్ద గుర్తించింది. సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా, మరోసారి కత్తి తీసి దాడి చేశాడు. ఇందులో అంకిత్, జయంత్, లోకేష్, పర్మీందర్ అనే నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. దీంతో పోలీసు బృందం అతనిపై  కాల్పులు జరిపింది. నడుము కింది భాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఎనిమిది రౌండ్లు కాల్పులు జరపగా, ఆరు బుల్లెట్లు నబీల్ కాళ్లకు తగిలాయి. అనంతరం చికిత్స కోసం అతన్ని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రూ. 13 లక్షల కారు కోసం రచ్చ, పెళ్లి రద్దు : ట్విస్ట్‌ అదిరింది!

స్టేషన్‌లో పోలీసులపై దాడి చేయడం, స్కూటర్ లాక్కోవడం, అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసు బృందంపై దాడి చేయడం వంటి నేరాల కింద అతనిపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేస్తున్నారు.   మరోవైపు 2022లో కూడా  ఇలాంటి దాడికి తెగబడినట్టు దర్యాగంజ్ పోలీస్ స్టేషన్‌లో నబీల్‌పై కేసు నమోదైనట్లు  పోలీస్‌ రికార్డుల ద్వారా  తెలుస్తోంది. 

ఇదీ చదవండి: 70 ఏళ్ల సమస్యకు నీనా గుప్తా సమాధానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement