పోలీసులపై కత్తితో దాడి  | Delhi man stabs five policemen at station during counselling session | Sakshi
Sakshi News home page

పోలీసులపై కత్తితో దాడి 

Nov 24 2026 5:31 AM | Updated on Nov 24 2026 5:31 AM

Delhi man stabs five policemen at station during counselling session

పారిపోతున్న నిందితుడిపై కాల్పులు

ఎట్టకేలకు అరెస్టు

9 మంది పోలీసులకూ గాయాలు

ఢిల్లీలోని పోలీసు స్టేషన్‌లో ఘటన

న్యూఢిల్లీ: తల్లి, సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా ఏకంగా ఎస్సైలు, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లపై తీవ్రస్థాయిలో కత్తితో దాడిచేసిన వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌ చేసిమరీ బంధించారు. 30 ఏళ్ల నబీల్‌ అనే వ్యక్తి సోమవారం ఢిల్లీ జామామసీద్‌ పోలీస్‌స్టేషన్‌లో చేసిన వీరంగం ఘటనలో 9 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ రోహిత్‌ రాజ్‌వీర్‌సింగ్‌ తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ తగాదాలో మందలించేందుకు నబీల్‌ను పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. దీంతో పట్టరాని ఆగ్రహంతో ఉన్న నబీల్‌ వెంటనే కత్తిని బయటకు తీసి పోలీసులపైకి దాడిచేశాడు. ఈ ఘటనలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు అజయ్, అరవింద్, హెడ్‌ కానిస్టేబుల్‌ హరీందర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకృష్ణ, హెడ్‌కానిస్టేబుల్‌ బల్జీత్‌ సైతం గాయపడ్డారు. 

బంధించేంలోపు నబీల్‌ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పోలీస్‌బృందం అతడిని వెంబడించి మధ్యాహ్నం 4.30 గంటలకు ఛిట్లీ కబల్‌ ప్రాంతంలో అడ్డగించింది. అక్కడ సైతం పోలీసులపై అతను దాడికి యత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు 8 రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. వీటిలో ఆరు అతని కాళ్లలోకి దూసుకెళ్లాయి. కుప్పకూలిన అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పోలీసులను లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ ఆస్పత్రి, శ్రీ గంగారాం ఆస్పత్రుల్లో చేరి్పంచారు. నిందితుడిపై 2022లోనూ ఒక కేసు నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement