శబరిమల వెళ్లే భక్తులకు గమనిక.. ఆ తప్పు చేయొద్దు | No Other Day Entry For Sabarimala Devotees QR Code | Sakshi
Sakshi News home page

Sabarimala Ayyappa Temple: అయ్యప్ప భక్తుల కోసం కొత్త రూల్స్

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

No Other Day Entry For Sabarimala Devotees QR Code

ప్రస్తుతం అయ్యప్ప స్వాముల సీజన్ నడుస్తోంది. చాలామంది స్వాములు.. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళలోని శబరిమల వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్.. దేవాలయానికి వచ్చే భక్తుల కోసం కొత్త నిబంధనలు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకుని, నిర్ణీత తేదీన దర్శనానికి హాజరుకాని భక్తులు.. అదే యాత్ర సీజన్‌లో మరోసారి ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది.

కొత్త నిబంధనలు ఇవే
ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ(OTP) ద్వారా మాత్రమే ఇకపై ఆన్‌లైన్ దర్శన బుకింగ్ చేసుకోవాలి. దర్శనం బుక్ చేసుకుని నిర్ణీత తేదీన హాజరుకాని భక్తులు అదే సీజన్‌లో మరోసారి ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోలేరు. అలాంటి భక్తులకు స్పాట్ దర్శనం ద్వారా మాత్రమే దర్శనం పొందే అవకాశం ఉంటుంది. అలానే బుక్ చేసుకున్న తేదీన దర్శనానికి వెళ్లలేని భక్తులు.. ముందుగానే తమ బుకింగ్‌ని రద్దు చేసుకోవచ్చు లేదా దర్శన తేదీని మార్చుకోవచ్చు.

గతంలో పంబలో అందుబాటులో ఉన్న స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని నిలిపివేశారు. దాని స్థానంలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు కేరళ పోలీసులు ప్రత్యేక 24 గంటల హెల్ప్‌లైన్‌ని ప్రారంభించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement