శబరిమల యాత్రికులే టార్గెట్‌.. లోదుస్తుల్లో 21 వేల నగదు! | Tamil Nadu Women Arrested in Kerala Theft Sabarimala Pilgrims Money | Sakshi
Sakshi News home page

శబరిమల యాత్రికులే టార్గెట్‌.. లోదుస్తుల్లో 21 వేల నగదు!

Nov 19 2026 12:09 PM | Updated on Nov 19 2026 12:09 PM

Tamil Nadu Women Arrested in Kerala Theft Sabarimala Pilgrims Money

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి యాత్రకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేందుకు ప్రయత్నించారనే అనుమానంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద తనిఖీలు చేయగా ఒక మహిళ లోదుస్తుల్లో దాచిన రూ.21 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బుధవారం మధ్యాహ్నం కొజెంచెర్రి నుంచి రాణికి వెళ్తున్న ప్రైవేట్‌ బస్సులో ఈ ఘటన జరిగింది. ప్రయాణ సమయంలో ఇద్దరు మహిళలు బస్సులోనే దుస్తులు మార్చుకోవడాన్ని గమనించిన సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే రాణి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారికి సమాచారం అందించారు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు రాణి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో బస్సును ఆపి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసుల సమక్షంలో తనిఖీలు చేయగా ఒకరి లోదుస్తుల్లో దాచిన రూ.21 వేల నగదు బయటపడింది. ఫొటోల ఆధారంగా వారి వివరాలు పరిశీలించిన పోలీసులు.. వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన పలు దొంగతనాల కేసులతో వారికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

అరెస్టయిన వారిని తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన భవాని అలియాస్‌ పార్వతి, తూత్తుకుడి జిల్లాకు చెందిన లక్ష్మి అలియాస్‌ పార్వతిగా గుర్తించారు. శబరిమల సీజన్‌లో ఎరుమేలి సహా ఇతర పుణ్యక్షేత్రాల వద్ద భక్తుల నుంచి నగదు, విలువైన వస్తువులు దొంగిలించేందుకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: భారత్‌ను బెదిరించిన పాక్‌ మంత్రి.. ఢిల్లీకి ఎందుకొస్తున్నట్టు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement